సీఎం అభ్యర్థి?: బిజెపిలోకి నేతాజీ ముని మేనల్లుడు
హౌరా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ముని మేనల్లుడు చంద్రబోస్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లగా ఆయన సమక్షంలో బోస్ బిజెపిలో చేరారు.
రాబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో చంద్రబోస్‌ను బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. నేతాజీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ పక్కపెట్టేసిందని అన్నారు. కాగా, చంద్రబోస్.. వచ్చే మేలో జరగనున్న ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు.
ఇదిలా ఉండగా అమిత్‌షా బిజెపి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత సోమవారం తొలిసారిగా పశ్చిమబెంగాల్ బహిరంగ సభలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications