గర్ల్ ఫ్రెండ్ ఐ ఫోన్ అడుగుతుంది.. సాయం చేయండి సోనూ భాయ్, ధీటుగా రిప్లై..

క‌రోనా సమయంలో చాలామందికి త‌న వంతు సాయం అందిస్తూ రియ‌ల్‌ హీరో అయ్యారు నటుడు సోనూసూద్. ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఇప్పటికీ రోజూ వేలాదిమంది సోషల్‌ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం అడుగుతున్నారు. కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్‌ మెసేజ్ చేస్తున్నారు.

ఓ యూజర్‌..'భాయ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా' అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన సోనూసూద్‌...'అది అవుతుందో లేదో కానీ ఐఫోన్‌ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి టైంపాస్‌ మెసేజ్‌లు ఎందుకు చేస్తారంటూ కొందరు నెటిజన్లు ఆతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్‌ భలే ఆన్సర్‌ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

netizen asked to sonu sood for iphone

గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్‌ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు చెందినవారికి కూడా సోనూసూద్ సాయం చేశారు. తాను సంపాదించిన మొత్తం పేదలు/ సాయం కోరిన వారికి ఇస్తు వస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఆయన విలన్ కానీ.. రియల్ లైఫ్‌లో హీరోగా మారారు.

అయితే అతనికి ఫన్నీ మెసేజ్‌లు రావడం కాస్త చిరాకు కలిగిస్తోంది. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా ఇలానే జరిగింది. కొందరు ఆకతాయిలు ట్వీట్లు చేశారు. వారికి అలానే సోనూ సూద్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఒరవడిని కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+