Chandrayaan3: ప్రకాశ్‍యాన్ అంటూ ప్రకాశ్ రాజ్‍ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతోన్నాయి. చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు ముందు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీటే ఇందుకు కారణం. ల్యాండింగ్ రెండు రోజుల ముందు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇస్రో ఛైర్మన్ చాయ్ పోస్తున్నట్లుగా ఫొటోలో కనిపించిది. ప్రకాశ్ రాజ్ ఫొటోతో పాటు బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ నుంచి మొదటి ఫొటో వచ్చింది. వావ్ అంటూ రాశారు.
ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ రాజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే యావత్ భారతావని గర్వపడేలా ఇస్రో విక్రమ్ ల్యాండర్ ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసింది. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విక్రమ్ ల్యాండర్ దిగ్విజయంగా చంద్రుడిని ముద్దాడడంతో చంద్రుడి పైకి ల్యాండర్ పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

చంద్రయాన్-3 విజయవంతమవడంతో నెటిజన్స్ అభ్యంతరకర ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ పడ్డారు. ప్రకాశ్ రాజ్ ను టార్గెట్ చేస్తూ మీమ్స్, పోస్టులు చేస్తున్నారు. ప్రకాశ్ యాన్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ బురదలో ఉన్నట్లు.. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫొటో ఇదేనంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి ఫొటో ఇదేనంటూ ఆడేసుకుంటున్నారు.
ఒక్కడు సినిమాలోని ఓ డైలాగ్ తో విరుచుకు పడుతున్నారు. స్వప్న సంక్రాంతి పండుగలో ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మను నేను అంటూ ప్రకాశ్ రాజ్ బురదలో కూడుకుపోయిన ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే చంద్రయాన్-3 విజయం పట్ల అభినందనలు తెలుపుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications