ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్‌కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?

ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. నిర్మలా వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు. దీంతో కేంద్రమంత్రి అశ్వని చౌబే రియాక్టయ్యారు. నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలిచారు.

తాను కూడా ఉల్లిగడ్డ తిననని అశ్వని చౌబే పేర్కొన్నారు. ఉల్లిగడ్డ కొనుగోలు చేయనప్పుడు తనకు వాటి ధర ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తమ ఇంటిలో ఉల్లిగడ్డ వాడమని ఆయన స్పష్టంచేశారు. తాను శాఖాహారినని, తనలాంటి వాళ్లకు ఉల్లిగడ్డ ధర గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇంట్లో వాడని వస్తువుల గురించి, వాటి ధరల గురించి ఎలా తెలుస్తుందని అడిగారు.

Never tasted onions, how will I know about situation: Ashwini Choubey

ఉల్లి ధరల అంశం పార్లమెంట్‌లో ప్రకంపనలు రేపుతుంది. ధరల నియంత్రణ ఏం చర్యలు తీసుకున్నారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీంతో బుధవారం నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఇంట్లో ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి వాడబోమని చెప్పారు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ నేతలు తమదైనశైలిలో స్పందించారు. ఒకడుగు ముందుకేసిన చిదంబరం.. అవకాడో పండు తింటారా అని నిర్మలా సీతారామన్‌ను అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+