New Aadhaar App: ఆధార్ అప్‌డేట్ ఇక మీ చేతుల్లోనే...
మీ ఆధార్(Aadhaar)కు లింకైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆధార్ కేంద్రానికి వెళ్ళడానికి సమయం లేదా? లేదా పాత నంబర్ పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఆధార్‌లో ఇతర వివరాలను మార్చాలన్నా కూడా, ఈ ప్రక్రియ మొత్తం అనవసరమైన గజిబిజిగా అనిపిస్తుందా? ఈ సమస్య ఏదైనా కావచ్చు, అయితే దీనికి ఇప్పుడు ఒకే పరిష్కారం లభించేసింది.
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రయాణంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఆధార్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, సురక్షితంగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సరికొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ (New Aadhaar App Launched) చేసింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. దేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సహనానికి పరీక్షే..
ఇప్పటి వరకు ఆధార్ సంబంధిత చిన్నచిన్న అవసరాలకే కేంద్రాలు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. మొబైల్ నంబర్ మార్చాలన్నా, చిరునామా అప్‌డేట్ చేయాలన్నా.. సమయం, సహనం రెండూ పరీక్షకు గురయ్యేవి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే UIDAI ఈ కొత్త ఆధార్ యాప్‌ను రూపొందించింది. రోజువారీ గుర్తింపు ధృవీకరణలను సరళంగా, భద్రంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం.
అవసరమైన సమాచారాన్ని మాత్రమే ..
ఈ యాప్‌లోని ముఖ్యమైన ఆకర్షణ ఆఫ్‌లైన్ ఆధార్ ధృవీకరణ. హోటల్ చెక్-ఇన్, సిమ్ కార్డు వెరిఫికేషన్, ఆఫీస్ అవసరాల కోసం ఆధార్ ఫోటోకాపీలు ఇవ్వడం వల్ల డేటా దుర్వినియోగం జరుగుతోందని UIDAI గుర్తించింది. అందుకే ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు పంచుకోకుండానే గుర్తింపు నిర్ధారించే విధానాన్ని ఈ యాప్‌లో ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుడికి పూర్తిగా నియంత్రణలో ఉండే భద్రతను అందిస్తుంది. కొత్త ఆధార్ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసుకుని షేర్ చేయొచ్చు. పేరు, వయసు వంటి పరిమిత వివరాలతో పాస్‌వర్డ్-రక్షిత ఫైల్‌ను తయారు చేసి పంచుకునే అవకాశం ఉంది. అలాగే, ధృవీకరించే సంస్థ ఇచ్చే QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా క్షణాల్లో గుర్తింపు నిర్ధారణ పూర్తవుతుంది. ఫిజికల్ కాపీలు అవసరం లేకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది.
సాధారణ ఫీజు తో మీ అప్లికేషన్ ప్రాసెస్
ఇక ఆధార్‌లో మొబైల్ నంబర్, చిరునామా అప్‌డేట్‌ల విషయానికి వస్తే, ఈ యాప్ పెద్ద ఊరటగా మారనుంది. ఆధార్ లోకి లాగిన్ అయి, అవసరమైన వివరాలను నేరుగా యాప్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. సాధారణ ఫీజు తో మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతాయి. ధృవీకరణ పూర్తైన తర్వాత, మార్పులు ఆధార్ రికార్డుల్లో అప్‌డేట్ అవుతాయి.
ఈ యాప్‌లో కుటుంబాలకు ఉపయోగపడే మరో ఫీచర్ కూడా ఉంది. ఒకే స్మార్ట్‌ఫోన్‌లో ఐదు ఆధార్ ప్రొఫైల్‌ల వరకు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. పిల్లలు లేదా ఆధారపడిన వారి ఆధార్ వివరాలను ఒకే చోట సురక్షితంగా చూసుకోవచ్చు. అలాగే 'ఆధార్ కాంటాక్ట్ కార్డ్' ఫీచర్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించకుండా అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ ధృవీకరణను ఉపయోగించే సంస్థలపై కూడా UIDAI కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బ్యాంకులు, హోటళ్లు, సేవా సంస్థలు ఈ విధానాన్ని వినియోగించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వంతో నమోదు చేసుకోవాలి. దీని ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టి, అధికారిక సంస్థల ద్వారానే ఆధార్ ధృవీకరణ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మొత్తానికి, ఈ కొత్త ఆధార్ యాప్‌తో ఆధార్ సేవలు కేవలం డిజిటల్‌గా మారడమే కాకుండా, ప్రజల రోజువారీ జీవితంలో నిజమైన సౌలభ్యంగా మారనున్నాయి. భద్రత, సులభత, నియంత్రణ ఈ మూడు అంశాల సమన్వయంగా రూపొందిన ఈ యాప్ డిజిటల్ గవర్నెన్స్‌లో మరో కొత్త అధ్యాయాన్ని తెరవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆధార్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
1. Google Play Store (ఆండ్రాయిడ్) లేదా Apple App Store (iOS) తెరవండి.
2. UIDAI "Aadhaar" యాప్ కోసం సెర్చ్ అయింది.
3. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
4. మీకు నచ్చిన భాషను ఎంచుకుని, సెటప్ పూర్తి చేయండి.
LIVE - Dedication to the Nation of Aadhaar App https://t.co/iS8c2e8P4Q
— Aadhaar (@UIDAI) January 28, 2026












Click it and Unblock the Notifications