New Covid Variant: సీ.1.2 ఇది చాలా ఫాస్ట్, వ్యాక్సిన్ల రక్షణ నుంచి తప్పించుకోగలదు!

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారితో ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతుండగా.. వెలుగులోకి వస్తున్న కొత్త వేరియంట్లు మరింత కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని బలితీసుకుంటున్నాయి. తాజాగా, మరో కోవిడ్ 19 వేరియంట్ వెలుగులోకి వచ్చింది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సీ 1.2 వేరియంట్

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన సీ 1.2 వేరియంట్

కరోనా వేరియంట్ సీ.1.2గా పిలుస్తోన్న ఈ వేరియంట్ తొలిసారిగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ప్రస్తుతానికి ఆందోళనకర వైరస్‌గా దీన్ని ప్రకటించనప్పటికీ.. వ్యాక్సిన్ నుంచి కలిగే రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ సీ.1.2ను ఈ ఏడాది మే నెలలోనే తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్ఐసీడీ), క్వాజులు-నాటల రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాం(కేఆర్ఐఎస్పీ)లు సంయుక్తంగా వెల్లడించాయి.

ఆగస్టు నాటికి మరికొన్ని ప్రపంచ దేశాలకు విస్తరించిన సీ.1.2 వేరియంట్

ఆగస్టు నాటికి మరికొన్ని ప్రపంచ దేశాలకు విస్తరించిన సీ.1.2 వేరియంట్

కాగా, ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ఈ వేరియంట్ విస్తరించినట్లు ఈ సంస్థలు తెలిపాయి. దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ విజృంభణ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిన సీ.1 వేరియంట్.. ఇప్పుడు మరిన్ని మ్యూటేషన్లు చెందిన సీ.1.2గా మారినట్లు వైద్య నిపుణులు పేర్కొన్నారు. అత్యధిక మ్యూటేషన్లకు గురైన వేరియంట్ ఈ సీ.1.2 అత్యధిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సీ.1.2 సీక్వెన్సింగ్ సమాచారం బట్టి చూస్తే.. దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వేరియంట్ వ్యాప్తి, ప్రాబల్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. బీటా, డెల్టా వేరియంట్ల మాదిరిగానే ఈ వేరియంట్ మ్యూటేషన్లో పెరుగుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సీ.1.2 తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం

సీ.1.2 తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం

సీ.1.2 వైరస్ మ్యూటేషన్ రేటు ఏడాదికి 41.8(మ్యూటేషన్లు)గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇతర రకాల మ్యూటన్ల రేటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో మార్పులు చెందుతున్నట్లు గుర్తించారు. వేగంగా మార్పు చెందడం వల్ల దానికి విరుగుడు కనుక్కోవడం కూడా కష్టసాధ్యంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాగా, ఎన్440కే, వై449హెచ్ వంటి మ్యూటేషన్లు వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఇదే తరహాలో సీ.1.2 వేరియంట్ కూడా యాంటీ బాడీలను తప్పించుకునే గుణం కలిగివుందని గుర్తించారు. ప్రస్తుతం ఈ రకాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా పరిశోధకులు పరిగణిస్తున్నారు. యాంటాబాడీల నుంచి తప్పించుకోవడంతోపాటు రోగనిరోధక ప్రతిస్పందనలనూ ఈ వేరియంట్లు ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడించారు.

Recommended Video

    Intranasal Covid Vaccine,మరింత బూస్టర్..! || Oneindia Telugu
    మనదేశంలో డెల్టా వేరియంట్ బీభత్సం అంతాఇంతా కాదు

    మనదేశంలో డెల్టా వేరియంట్ బీభత్సం అంతాఇంతా కాదు

    ఈ క్రమంలో తాజా వేరియంట్ల కోసం మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అసవరం ఉందని చెబుతున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిల్లోనూ వీటిని పరిగణలోకి తీసుకుని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రపంచాన్ని అనేక కరోనా వేరియంట్లు భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలో అయితే డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్‌లో మిగిల్చన విషాదం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది కరోనా బారినపడగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక దేశలో డెల్టా వేరియంట్ కారణంగా వైద్య సంక్షోభం ఏర్పడే పరిస్థితి వచ్చింది. గత కొద్ది వారాలుగానే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. కేరళలో మాత్రం కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండగా.. కేరళలో మాత్రం 30వేల వరకు రోజువారీగా కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+