వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nude video: కొడుకుతో సిగ్గుమాలిన పని చేసింది, సుప్రీం కోర్టులో చివాట్లు, ఏమనుకుంటున్నావ్, నో బెయిల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ కొచ్చి/ కేరళ: కన్న బిడ్డలతో (ఎదుగుతున్న కొడుకు, కూతురు) అర్దనగ్నంగా శరీరం మీద వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియోను బాడీ ఆర్ట్స్ అండడ్ పాలిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో విడుదల చేసి తీవ్రవివాదానికి కారణమైన కేరళ ఆక్టివిస్టు రెహానా ఫాతిమాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైయ్యింది. మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ? మీరు ఆక్టివిస్టు కావచ్చు, అయినంత మాత్రానా ఇలా చేస్తారా ? అంటూ సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించడం, ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో కేరళకు చెందిన రెహానా ఫాతిమా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

పాడుపని చేసిన రెహానా ఫాతిమా

పాడుపని చేసిన రెహానా ఫాతిమా

ఎదుగుతున్న కొడుకుతో కేరళ ఆక్టివిస్టు చెయ్యరాని పని చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అర్దనగ్నంగా తయారైన రెహానా ఫాతిమా ఆమె శరీరం మీద రంగురంగులతో వాటర్ పెయింటింగ్ వేయించుకుంది. కొడుకు, కూతరు అర్దనగ్నంగా ఉన్న రెహానా ఫాతిమా శరీరంపై పెయింటింగ్ వేస్తున్న సమయంలో ఓ వీడియో తీయించి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

 ఫ్రీ పబ్లిసిటీ కాదు దూలతీరింది

ఫ్రీ పబ్లిసిటీ కాదు దూలతీరింది

అర్దనగ్నంగా శరీరంపై వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఫ్రీగా పబ్లిసిటీ సంపాధించాలని ప్రయత్నించిన రెహానా ఫాతిమాకు కష్టాలు మొదలైనాయి. మైనర్లతో అర్దనగ్నం వాటర్ పెయింట్ వేయించుకోవడమే కాకుండా ఆ వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేసి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపించడానికి ప్రయత్నంచిందని కేరళ ప్రభుత్వం ఆక్టివిస్టు రెహానా ఫాతిమా మీద పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

కేరళ కోర్టు చుట్టూ ఫాతిమా ప్రదక్షిణలు

కేరళ కోర్టు చుట్టూ ఫాతిమా ప్రదక్షిణలు

పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయినా రెహానా ఫాతిమా కొంచెంకూడా దగ్గలేదు. తాను చెయ్యరాని పని ఏమీ చెయ్యలేదని, తన శరీరం మీద పెయింటింగ్ వేసింది తన కొడుకు అంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కేరళ పోలీసులు అరెస్టు చెయ్యకుండా రెహానా ఫాతిమా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి కేరళ హైకోర్టు నిరాకరించడంతో రెహానా ఫాతిమా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

నువ్వు ఏం చేశావో నీకు తెలుసా !

నువ్వు ఏం చేశావో నీకు తెలుసా !


శుక్రవారం సుప్రీం కోర్టులో రెహానా ఫాతిమా బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులు రెహానా ఫాతిమా బెయిల్ పిటిషన్ ను విచారణ చేశారు. అసలు మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో మీకైనా తెలుసా ?, సమాజంపై మీరు చేస్తున్న పనులు దష్ర్పభావం చూపిస్తోంది, మీరు అసభ్యతను సమాజానికి చాటి చెప్పాలని ప్రయత్నిస్తున్నారా ? మీలాంటి వాళ్లకు బెయిల్ ఇవ్వడం కుదరదని అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రెహానా ఫాతిమా బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

సినిమా స్టోరీ చెప్పిన లాయర్

సినిమా స్టోరీ చెప్పిన లాయర్

రెహానా ఫాతిమా తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ సినిమా స్టోరీ చెప్పడానికి ప్రయత్నించారు. కేరళలోని పలు ఆలయాల్లో అర్దనగ్నంగా దేవతా మూర్తులు కనిస్తారని, అలాగని అక్కడికి వెళ్లిన భక్తులు కామంతో కాకుండా విగ్రహాల్లో దైవత్వం చూసుకుంటారని, తన కైంట్ ను అలాగే చూడాలని న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ అన్నారు.

Recommended Video

టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu
స్త్రీ కావడం వలనే రామాయణం

స్త్రీ కావడం వలనే రామాయణం

తన క్లైంట్ స్త్రీ కావడం వలనే ఇంత రాద్దాంతం జరిగిందని, ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని రెహానా ఫాతిమా తరపు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ సుప్రీం కోర్టులో మనవి చేశారు. అయితే రెహానా ఫాతిమాకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. సుప్రీం కోర్టులో రెహానా ఫాతిమాకు చుక్కెదురు కావడంతో ఆమెను అరెస్టు చెయ్యడానికి కేరళ పోలీసులు సిద్దం అయ్యారు.

English summary
New Delhi: Supreme Court dismisses anticipatory bail plea of Rehana Fathima in semi nude video case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X