ఎంపీల కోసం 36 కొత్త బంగళాలు.. ఎక్కడో తెలుసా..?
న్యూఢిల్లీ: ఎంపీల కోసం కొత్తగా 36 డూప్లెక్స్ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం నార్త్ అవెన్యూ ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త బంగ్లాలనీ పాత బంగ్లాలను కూల్చి నిర్మిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ పాత బంగ్లాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్నాయని ఆయన చెప్పారు. కొత్తగా నిర్మాణం అయ్యే బంగ్లాలన్నీ రాష్ట్రపతి భవన నిర్మాణంతో పోలిఉంటాయని అధికారి వివరించారు. ఇక ఈ బంగ్లాలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్మిస్తుందని స్పష్టం చేశారు.
సౌత్ మరియు నార్త్ అవెన్యూలో ఉన్న పాత బంగళాలను దశలవారీగా కూల్చి అక్కడ కొత్త బంగ్లాలను నిర్మిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక రెండో దశలో వీటి నిర్మాణం జరుగుతుందని వివరించిన అధికారి... తొలి దశలో 36 గృహాలను నార్త్ అవెన్యూలో నిర్మించామని కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ వాటికి గృహప్రవేశం చేశారని చెప్పారు. కొత్తగా నిర్మాణం చేపట్టబోయే నివాసాలు 36 అని చెప్పిన అధికారి అందులో మోడ్యులర్ కిచెన్, నాలుగు బెడ్‌రూంలు, ఒక లిఫ్టు, ఆఫీస్ ఏరియాలు ఉంటాయని చెప్పారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి బంగ్లాల్లోనే ఎంపీలు నివాసముంటున్నారని చెప్పారు. వీటిని దశల వారీగా కూల్చి కొత్త బంగ్లాలను నిర్మిస్తామని చెప్పారు. మరో ఏడాదిన్నర సమయంలోకొత్త బంగ్లాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇక ఈ గృహాల్లో సోలాన్ ప్యానెల్స్, ఎల్‌ఈడీ లైట్లు, రెండు కార్లు పార్క్ చేసుకునేలా పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications