త్వరలో కొత్త వంద నోట్లు: నోట్లలో చిన్న చేంజ్..!
అతి త్వరలో కొత్త రూ.100 నోట్లను విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
ముంబై : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశంలో ఏ బ్యాంకు, ఏటీఎం ముందు చూసినా.. చాంతాడంతా క్యూ లైన్లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. నోట్లు దొరికినా.. రూ.2వేల నోటుకు చిల్లర సంపాదించలేని పరిస్థితి. ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే వంద నోట్లను ఎక్కువ సంఖ్యలో ముద్రించి తీరాల్సిందే.

ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అతి త్వరలో కొత్త రూ.100 నోట్లను విడుదల చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది.కొత్త నోట్లలో ఇరువైపులా ఉన్న నంబరు ప్యానల్స్‌లో ఇన్‌సెట్ లెటర్ ఉండదని తెలపడం గమనార్హం. పాత వంద రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సూచించింది.












Click it and Unblock the Notifications