Income Tax Bill: లోక్ సభ ముందుకు నూతన ఆదాయపు పన్ను బిల్లు

Income Tax Bill: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం నాడు లోక్ సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టారు. ఇది ఆరు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్నుచట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులో లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో లోక్ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికే లోక్ సభ మార్చి 10కి వాయిదా పడింది.

1961లో తీసుకువచ్చిన ఆదాయపు పన్ను చట్టానికి ఎన్నోసవరణలు జరగడంతో సంక్లిష్టంగా తయారైంది. దీంతో పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకుని అనుసరించగలిగేలా పన్ను సంబంధిత నిబంధనలను సరళీకృతం చేయడం దీని ఉద్దేశం. దీని ద్వారా పన్ను సంబంధిత కేసులు, వివాదాలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. బిల్లును సమీక్షించడానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఇప్పుడు ఈ కమిటీ బిల్లును సమీక్షిస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ లో చర్చించబడుతుంది.

New Income Tax Bill 2025 Introduced in Lok Sabha

కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని ముఖ్యాంశాలు..

*కొత్త బిల్లు ముసాయిదాలో 536 విభాగాలు, 16 షెడ్యూల్‌లు, 23 అధ్యాయాలు ఉన్నాయి. మినహాయింపుకు సంబంధించిన నియమాలు వివిధ విభాగాలలో ఇవ్వబడ్డాయి.

*కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025లో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో 298 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూల్‌లు ఉండగా, కొత్త చట్టంలో 16 షెడ్యూల్‌లు ఉంటాయి.

*1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో వచ్చే కొత్త ఆదాయపు పన్ను బిల్లు 622 పేజీలను కలిగి ఉండగా.. 1961లో ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు 880 పేజీలను కలిగి ఉంది. ఆ తర్వాత గత ఆరు దశాబ్దాలుగా ఈ చట్టానికి పలు సవరణలు చేయడంతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొత్త బిల్లులో చాలా ఉప విభాగాలను రద్దు చేశారు.

*కొత్త ఆదాయపు పన్ను బిల్లులో, ఇప్పుడు పన్ను గణన వ్యక్తి (ఎ), హిందూ అవిభక్త కుటుంబం (బి), వ్యక్తుల సమూహం (సి) వంటి ఉప-విభాగాలకు బదులుగా పన్ను స్లాబ్ ప్రకారం జరిగింది.

*ఆర్మీ, పారా బలగాలు, ఇతర ఉద్యోగుల వంటి రక్షణ రంగానికి వచ్చే గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఇవ్వబడింది.

*కొత్త బిల్లులో అగ్నిపథ్ పథకం కింద ఇచ్చే విరాళాలపై ఎటువంటి పన్నుఉండదు.

*గృహ రుణాలు, వైద్య, పీఎఫ్, ఉన్నత విద్యకు రుణాలు, విద్యుత్ వాహనాలు, బీమాపై పన్ను మినహాయింపులు అలాగే ఉంచబడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+