షిండేతో శరద్ పవార్ రాయబారం- అనూహ్యంగా తెరపై?

New Maharashtra CM: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది.

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి స్పష్టతా రావాట్లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.

New Maharashtra CM NCP-SP MLA Jitendra Awhad met CM Eknath Shinde

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది బీజేపీ.

దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది షిండే వర్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. దీనికి ప్రతిగా తాము పెట్టిన డిమాండ్లను అంగీకరిస్తే తప్ప లొంగే ప్రసక్తే లేదనే సమాచారాన్ని బీజేపీ అధిష్ఠానానికి పంపించింది. దీనికి నిదర్శనమే- ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన మహాయుటి కూటమి భేటీ రద్దు కావడం.

ఇంకాస్సేపట్లో మహాయుటి భేటీ జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నట్టుండి షిండే తన స్వగ్రామానికి ప్రయాణం కట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సుముఖంగా లేరనే విషయం దీనితో మరోమారు స్పష్టమైనట్టయింది.

ఈ పరిస్థితుల్లో శరద్ పవార్.. రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతో రాయబారాలు మొదలుపెట్టారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జితేంద్ర అవ్హాద్‌ను రాయబారిగా పంపించారని అంటోన్నారు. శుక్రవారం సాయంత్రం ఎకాఎకిన అవ్హాద్.. షిండేతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు వారిద్దరి మధ్య చర్చలు సాగాయి.

అనంతరం అవ్హాద్ విలేకరులతో మాట్లాడారు. తాను వ్యక్తిగత పని కోసం ముఖ్యమంత్రిని కలిశానని పేర్కొన్నారు. దీనికి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంపై మాట్లాడటానికి నిరాకరించారు. షిండేకు ఎవరి మీదా ఎలాంటి కోపం లేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+