నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ పూర్తి షెడ్యూల్ ఇదే: 28న 7.30కే పూజ, మోడీ చేతులు మీదుగా

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లెమెంట్ను ప్రారంభించనున్నారు. రెండు దశల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 28న ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనుండగా.. ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమంతో వేడుక మొదలు కానుంది. ఈ వేడుక హవన్, పూజతో ప్రారంభమమై, ప్రధాని మోడీ ప్రసంగంతో ముగుస్తుంది.

 New Parliament

అయితే, దేశంలోని పవర్ కారిడార్ అయిన సెంట్రల్ విస్టా పునరాభివృద్ధిలో భాగమైన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రధాని మోడీకి బదులు రాష్ట్రపతి గానీ, స్పీకర్ గానీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, టీడీపీ, బీజేడీ, మాయావతికి చెందిన బీఎస్పీ సహా దాదాపు 17 పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే:

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకే మొదలవుతుంది.
మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర హవన్, పూజతో ప్రారంభమవుతుంది. ఈ పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు.

 New Parliament
8.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయి.
8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్‌‌ని లోక్‌సభలో పొందుపరచనున్నారు.
ఉదయం 9:30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పురోహితులు, సాధువులు పాల్గొనే ప్రార్థనా సభ జరుగుతుంది. ఈ ప్రార్థనా సమావేశంలో శివుడు, ఆదిశంకరులను పూజిస్తారు.

ఆ తర్వాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది.
ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్ జరుగుతుంది.
అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు. రాజ్యసభలో కూడా సందేశాన్ని వినిపిస్తారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓ కాయిన్‌, స్టాంప్ విడుదల చేస్తారు.
ఆ తర్వాత 2:30 గంటలకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+