"మార్కెట్లోకి కొత్త వెయ్యి నోటు కూడా వస్తుందోచ్.."
మహబూబాబాద్ : రూ.500, రూ.1000 నోట్లపై నిషేధం విధించిన తర్వాత.. నేటి నుంచే కొత్త రూ.2వేల నోటు మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. నిషేధించిన రూ.1000నోటు స్థానంలో కొత్త డిజైన్ తో కూడిన వెయ్యి నోటును మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు.
కొత్త వెయ్యి నోట్లకు సంబంధించి గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేస్తున్నామని, మరికొద్ది నెలల్లో కొత్త వెయ్యి నోటు మార్కెట్లోకి వస్తుందని శక్తికాంత్ తెలిపారు. ఇదివరకు ఉన్న కలర్ కాకుండా, కొత్త కలర్ తో పాటు కొత్త లుక్ తో నోటును ముద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఐకి చెందిన కేవలం ఇద్దరు ముగ్గురు అధికారులు పర్యవేక్షణలోనే కొత్త వెయ్యి నోట్ల ప్రక్రియ జరుగుతున్నట్టుగా తెలియజేశారు.

ఇకపోతే ఈరోజు మార్కెట్లోకి విడుదలైన కొత్త రూ.2వేల నోటును అందుకుని మురిసిపోతున్నారు వినియోగదారులు. గులాబీ రంగులో ఉన్న కొత్త 2వేల నోటుపై గాంధీ బొమ్మ మధ్యలో ఉండడం విశేషం. నోటుకు ఎడమవైపు కింద భాగంలో '2000' అని రాసి ఉంటుంది. అయితే 45డిగ్రీల కోణంలో నోటును వంచి చూసినప్పుడే అది స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications