రూ.100 నోటు విడుదల చేసేందుకు ఆర్‌బిఐ సన్నాహలు
కొత్త రూ.100 నోటును మార్కెట్లోకి విడుదల చేయాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త వంద రూపాయా నోటును ఆర్‌బిఐ ప్రింట్ చేస్తోందని సమాచారం.
న్యూఢిల్లీ: కొత్త రూ.100 నోటును మార్కెట్లోకి విడుదల చేయాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి కొత్త వంద రూపాయా నోటును ఆర్‌బిఐ ప్రింట్ చేస్తోందని సమాచారం.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్‌బిఐ కొత్త కొత్త నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. కొత్త డినామినేషన్ నోట్లనే కాకుండా ప్రస్తుతమున్న వాటికి కొత్త నోట్లను తీసుకొస్తోంది.

తాజాగా100 రూపాయి కరెన్సీ నోట్లు కొత్తవి మార్కెట్‌లోకి ఆర్‌బిఐ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.. 2018 ఏప్రిల్ నుంచి ఈ నోట్ల ప్రింటింగ్‌ను ప్రారంభించాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్టు ఆర్‌బిఐ వర్గాలు చెప్పాయి.
రూ.200 డినామినేషన్ నోట్ల ప్రింటింగ్ పూరైన తర్వాత వెంటనే ఈ కొత్త రూ.100 నోట్ల ప్రింటింగ్‌ను మొదలుపెట్టాలని ఆర్బీఐ చూస్తుందని తెలిపాయి. కొత్త రూ.200 నోట్లు పూర్తిగా సిస్టమ్‌లోకి రావాలంటే కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుందని సమాచారం.
కొత్త సెక్యురిటీలో ఈ నోట్లను ముద్రిస్తున్నారని సమాచారం. ప్రస్తుతమున్న రూ.100 డినామినేషన్ నోట్లు సిస్టమ్‌లో ఉంటాయని, కానీ మెల్లమెల్లగా వాటిని వెనక్కి
తీసుకొనే ఆలోచనలో ఆర్‌బిఐ ఉందని ప్రచారం సాగుతోంది.
కొత్త రూ.100 నోట్ల సైజులో ఎలాంటి మార్పులు ఉండబోవట. ఏటీఎంలలో సరిపోయే విధంగానే వీటిని తయారుచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిల్లర కొరతకు అడ్డుకట్ట వేయడానికి చిన్న డినామినేషన్ నోట్ల విడుదలపై ఆర్బీఐ ఎక్కువగా దృష్టిసారించింది.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications