వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలుదేది? నకిలీదేది?: రూ.2వేల నోటులో 'షాక్' పుట్టించే సెక్యూరిటీ ఫీచర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రూ.2వేల కొత్త నోటు మార్కెట్లోకి రాగానే.. 'దాన్లో ఓ సీక్రెట్ చిప్ ఉంటుందని, ఆ చిప్ ను శాటిలైట్ తో అనుసంధానం చేశారని, తద్వారా కరెన్సీ నోట్లు ఎక్కువగా పోగుబడి ఉండే ప్రాంతాన్ని ప్రభుత్వం సులువుగా గుర్తిస్తుందని' సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేసింది. అయితే ఆ తర్వాత అలాంటిదేమి లేదంటూ ఆర్థిక శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే.. రూ.2వేల నోటుకు ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు అంటూ ఏమి లేవా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్కెట్లోకి నకిలీ రూ.2వేల నోట్లు వచ్చి కలకలం కూడా సృష్టించాయి. అయితే కొత్త రూ.2వేల నోటుకు సంబంధించి ఓ ఆసక్తికర సెక్యూరిటీ ఫీచర్ ను తాజాగా వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. రూ.2వేల నోటులో ఉన్న 'ఇంటాగ్లియో' అనే సెక్యూరిటీ ఫీచర్ గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

New Rs 500, 2000 notes, how to spot real from fake

ఏంటా సెక్యూరిటీ ఫీచర్..?

ఇంటాగ్లియో సెక్యూరిటీ ఫీచర్‌లో భాగంగా.. కరెన్సీ నోటులోకి ఒకరకమైన డిజైన్‌ను ప్రవేశపెడుతారు. దీని ద్వారా నకిలీ నోట్లను సులువుగా గుర్తించవచ్చు. ఏదైనా ఓ వస్త్రాన్ని తీసుకుని నోటుపై రుద్దినప్పుడు.. టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉత్పన్నమవుతుంది. అంటే.. నోటుపై వస్త్రాన్ని రుద్దిన వ్యక్తికి చిన్నపాటి షాక్ లాంటిది తగులుతుంది.

నోటులో ఉండే ఇంకు వస్త్రంలోకి బదిలీ కావడం ద్వారా ఈవిధంగా జరుగుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీన్నిబట్టి.. టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉత్పన్నమయ్యే నోట్లను అసలైనవిగాను, లేనిపక్షంలో వాటిని నకిలీవిగాను గుర్తించవచ్చు.

English summary
Its a special feature in new RS2000 notes introduced by indian finance ministry. This note is having a rare security feature that produces turbo electric shock
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X