డ్రైవర్ వివరణ: జయలలిత హాస్పిటల్‌లో చేరకముందు ఏం జరిగింది..?
Recommended Video

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత డెత్ మిస్టరీ మరో మలుపు తీసుకుంది. జయలలిత చనిపోయే వరకు ఆమె వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేసిన కన్నన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 1991 నుంచి కన్నన్ జయలలితకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
సెప్టెంబర్ 22, 2016లో జయలలిత గదిలోకి తాను వెళ్లగా అప్పటికే ఓ కుర్చీలో కూర్చొని అపస్మారక స్థితిలో ఉండటాన్ని తాను చూసినట్లు కన్నన్ తెలిపాడు. రాత్రి 10 గంటలకు జయలలిత వ్యక్తిగత భద్రతా అధికారి వీరపెరుమాల్ కారు తీసుకురావాల్సిందిగా తనను ఆదేశించాడని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత మరో పెద్ద కారు తీసుకురావాల్సిందిగా అమ్మ దగ్గర పనిచేసే పనిమనిషి చెప్పిందన్న కన్నన్... పెద్ద కారు తెచ్చాక శశికళ పిలుస్తున్నారని చెప్పడంతో గదిలోకి వెళ్లినట్లు కన్నన్ చెప్పాడు.రెండో అంతస్తులో ఉన్నఅమ్మ గదిలోకి వెళ్లగానే అక్కడే కొన్ని ఫైళ్లు మరో పెన్ను కిందపడి ఉండటాన్ని గమనించినట్లు కన్నన్ వివరించాడు.ఇక స్పృహ కోల్పోయి ఉన్న జయలలితను కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించినట్లు గుర్తుచేశాడు. రెండు సార్లు ప్రయత్నించాక... ఆ ప్రయత్నాన్ని విరమించి స్ట్రెచర్‌లో అమ్మను తరలించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

" పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసానికి శశికల బంధువు, జయలలితకు వ్యక్తిగత డాక్టరుగా పనిచేసే కేఎస్ శివకుమార్ అమ్మ ఇంట్లో రాత్రి 8:30 గంటలకు చూశాను. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన పోయెస్ గార్డెన్ వదిలి ఆయన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడొచ్చారో తెలియదు" అని శివకుమార్ అరముగస్వామి కమిషన్‌కు స్టేట్ మెంట్ ఇచ్చాడు.
మొత్తానికి జయలలిత మృతిపై విచారణ చేస్తున్న అరముగస్వామి కమిషన్‌కు శశికళ ఇచ్చిన వివరణ, డ్రైవర్ కన్నన్ ఇచ్చిన వివరణ రెండు వేర్వేరుగా ఉండటంతో జయలలిత మృతి మిస్టరీగా మారింది. అయితే ఇప్పటివరకు కమిషన్ ఎవరికీ అంటే ఎయిమ్స్ వైద్యులకుగానీ, ఆనాటి జయలలిత కేబినెట్ మంత్రులకు గానీ, అపోలో హాస్పిటల్ వర్గానికి గానీ ఎలాంటి నోటీసులు పంపలేదు.












Click it and Unblock the Notifications