New Year 2021:మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు న్యూఇయర్ విషెస్ ఇలా చెప్పండి..!
2020... సంవత్సరం కొత్త ఆశలతో ఏడాది ప్రారంభించినప్పటికీ ఈ సంవత్సరంలో చాలామందికి చేదు జ్ఞాపకాలే ఎక్కువగా మిగిలాయి. మార్చి చివర నుంచి దేశం కరోనా కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో చాలామందికి చేదు జ్ఞాపకాలే మిగిల్చింది 2020. ఇక కొత్త సంవత్సరం అంటే 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సంవత్సరం మాత్రం కచ్చితంగా శుభదాయకంగా సాగాలని కోరుకుందాం. మీ కుటుంబ సభ్యులకు, మీ బంధు మిత్రులకు, స్నేహితులకు మంచి సందేశాలను కొత్త ఏడాది రోజున పంపండి. వారికి మంచి సందేశాలు పంపి వారిలో ఆనందాన్ని నింపండి.
కొత్త సంవత్సరం విషెస్ కోసం వాట్సాప్‌లో కొన్ని స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో వాట్సాప్ ఉంటుంది. వారికి న్యూఇయర్ విషెస్ వాట్సాప్ ద్వారా పంపండి. వాట్సాప్ స్టిక్కర్స్ , జీఐఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ దీని గురించి తెలియకపోతే... వాట్సాప్‌లోనే బేసిక్ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక పండగలకు సంబంధించిన విషెస్ స్టిక్కర్లు కావాలంటే తప్పకుండా థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. 2021కి సంబంధించి మీకు ఇష్టమైన వారికి న్యూఇయర్ విషెస్ పంపేందుకు మేము మంచి యాప్స్‌ను ఎంపిక చేశాం.

వాట్సాప్‌పై హ్యాపీ న్యూఇయర్ 2021 స్టిక్కర్స్ ఎలా పంపాలంటే..
ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి New Year 2021 స్టిక్కర్స్ అని టైప్ చేయాలి. అందులో చాలా యాప్స్ డిస్‌ప్లే అవుతాయి.అందులో నుంచి ఏదో ఒక యాప్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే అన్ని యాప్స్‌లో కెల్లా Happy New year 2021 stickers యాప్ చాలా బాగుంది. ఇది ఓపెన్ చేస్తే 6 స్టిక్కర్ ప్యాక్స్ ఇందులో ఉన్నాయి. ఇక స్టిక్కర్స్‌ను వాట్సాప్‌కు యాడ్ చేసేందుకు స్టిక్కర్స్ విండోలో ప్లస్ గుర్తు ఉండే బటన్‌పై నొక్కాలి. వెంటనే వాట్సాప్‌కు యాడ్ చేయాలని అనుకుంటున్నారా.. అని వచ్చినప్పుడు Add అని నొక్కాల్సి ఉంటుంది. దీంతో అన్ని స్టిక్కర్స్ వాట్సాప్‌లో యాడ్ అవుతాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications