న్యూ ఇయర్ గిఫ్ట్.. వంటగ్యాస్ ధర తగ్గింపు

ఢిల్లీ : వంటగ్యాస్ ధర తగ్గిస్తూ వినియోగదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ పై 5 రూపాయల 91 పైసలు తగ్గించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో 500 రూపాయల 90 పైసలు ధర ఉన్న సిలిండర్ కాస్ట్..

494 రూపాయల 99 పైసలకు తగ్గినట్లైంది. దీంతో 30 రోజుల వ్యవధిలో రెండు సార్లు సిలిండర్ ధరలు దిగొచ్చాయి. వాస్తవానికి 2018, జూన్ నుంచి సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే నవంబర్ 30న సబ్సిడీ సిలిండర్లపై 6 రూపాయల 52 పైసలు తగ్గింది.

new year gift as reduced cost on gas cylinders

కొత్త సంవత్సరం కానుకగా సిలిండర్ ధర తగ్గినప్పటికీ.. మార్కెట్ అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఐఓసీ అధికారులు. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం.. డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ కొంతమేర బలపడటం దీనికి కారణం. రాయితీ లేని సిలిండర్ల ధర 120 రూపాయల 50 పైసలు తగ్గింది. ఢిల్లీలో 809 రూపాయల 50 పైసలు ఉండగా కొత్త ధర 689 రూపాయలు ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+