చిన్నారికి జ్వరం: తగ్గించేందుకు మంత్రగత్తె చిత్రహింసలు, నెట్‌లో వీడియో

మోరిగాన్: అస్సాంలోని మోరిగాన్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. మోరిగాన్ జిల్లా సీనియర్ అధికారి రాకేష్ కుమార్ వెల్లడించిన వివారాల ప్రకారం... పుట్టినప్పటి నుంచి ఓ చిన్నారికి విపరీతమైన జ్వరం వస్తుండటంతో, తల్లిదండ్రులు వైద్యం కోసం ఓ మంత్ర గత్తె వద్దకు తీసుకెళ్లారు.

చిన్నారి జ్వరం తగ్గిస్తానంటూ 50 ఏళ్ల మంత్రగత్తె చిన్నారి మెడ పట్టుకొని పైకెత్తి నానా చిత్రహింసలు పెట్టింది. అంతే కాదు ఆ చిన్నారి చేత కొంత దూరం నడిపించింది కూడా. ఈ ఘటన మొత్తాన్ని ఒక యువకుడు తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో ఉంచాడు.

Newborn Forced to Walk by Witch Doctor in Assam Village as Fever Cure

ఇంటర్నెట్లో ఆ వీడియో హల్ చల్ చేయడంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ మంత్రగత్తెను అదుపులోకి తీసుకుని... చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తానికి కారకులైన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

చిన్నారిని ఆసుపత్రిలో చేర్చాక, జ్వరం నుంచి పూర్తిగా కొలుకున్నాడని ఎలాంటి ప్రమాదం లేదని రాకేష్ కుమార్ వెల్లడించారు. ప్రజల్లో ఉన్న మూడ నమ్మకాలే ఇలాంటి సంఘటనలకు కారణమని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ క్యాంపెయిన్స్ నిర్వహిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+