91 లక్షలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ప్రపంచదేశాల్లో మూడో స్థానంలో కంటిన్యూ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో కొత్తగా తగ్గుదల నమోదైంది. ఇదివరకటి రోజువారీ సంఖ్యతో పోల్చుకుంటే.. కొత్త ఏడు వేలకు పైగా కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే. ఇంతకుముందు కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా కనిపించిన మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రభావం జాతీయస్థాయి గణాంకాలపై పడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇదివరకట్లా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావట్లేదు. ఏపీలో నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య వెయ్యికి దిగువగా నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కొత్తగా 37,975 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 480 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 91,77,841కి చేరుకున్నాయి. ఇందులో 86,04,955 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య లక్షా 35 వేలకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 1,34,218 మంది మృతి చెందారు. 24 గంటల్లో కొత్తగా 42,314 మంది కరోనా బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Newly 37975 Covid 19 positive case 480 deaths have been reported in India in last 24 hours

Recommended Video

    COVID-19 : India Records 45,209 New Cases కరోనా వైరస్‌కు సీజనల్ వ్యాధులు కూడా తోడైతే....!!

    ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్‌లోనే. మరోవంక- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 13,36,82,275 కోట్ల నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే 10,99,545 శాంపిళ్లను పరీక్షించామని, కరోనా మరణాల రేటు 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపారు. 93.7 శాతం మేర పేషెంట్లు కోలుకుంటున్నారని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+