దేశంలో భయానకంగా కరోనా: లక్షా పాతిక వేలను దాటిన మరణాలు: జాగ్రత్తలు పాటించకపోతే..అంతే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. పండుగల సీజన్ ఆరంభం కావడం, ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడం వంటి కారణాలతో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుదల బాట పట్టే ప్రమాదం నెలకొంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకోవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఇదివరకట్లా ముందుజాగ్రత్త చర్యలను పాటించకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.
అన్‌లాక్ తరువాత జనజీవనంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ప్రజలుముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదనే విషయం కరోనా కేసుల పెరుగుదలతో స్పష్టమౌతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు చెబుతున్నారు. దేశంలో కొత్తగా 44,281 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అన్‌లాక్ తరువాత కనిష్ట స్థాయి నుంచి మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంక్య 86,36,012కు చేరుకోగా.. ఇందులో 80,13,784 మంది డిశ్చార్జి అయ్యారు. లక్షా పాతిక మందికి పైగా మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,27,571కు చేరుకుంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కరోనా మృతుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది భారత్‌లోనే. అమెరికా-245,799, బ్రెజిల్-162,842 మంది మరణించారు. కొత్తగా 24 గంటల్లో 512 మంది కన్నుమూశారు.
Recommended Video
మొత్తం డిశ్చార్జీల సంఖ్య 80,12,784కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 4,94,657. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత తొలిసారిగా యాక్టివ్ కేసుల సంఖ్య అయిదు లక్షలకు దిగువగా నమోదైంది. కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అవుతోన్న వారు భారీగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. 24 గంటల్లో 50,326 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అయినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు, కోలుకుంటోన్న వారి సంఖ్య మధ్య ఉన్న ఆంతర్యం తగ్గుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications