ఫేక్ ఎకౌంట్, కేంద్రమంత్రి అనుప్రియనూ వదల్లేదు..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల జాబితా కోట్లలోనే ఉంటుంది. సోషల్ మీడియా ఎకౌంట్ ను ప్రతీ ఒక్కరు మెయింటెన్ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా సంబంధాలు విస్త్రుతమయిన సంగతి తెలిసిందే. అయితే నకిలీ ఖాతాలతో దీన్ని దుర్వినియోగం చేస్తోన్న వారి జాబితా కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.

తాజాగా కేంద్రమంత్రి అనుప్రియ కూడా ఫేక్ ఎకౌంట్ బారిన పడ్డారు. కేంద్రమంత్రి అనుప్రియ ప్రమేయం లేకుండానే ట్విట్టర్ లో తన పేరు మీద ఓ నకిలీ ఖాతాను తెరిచిన గుర్తు తెలియని నెటిజెన్స్, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా కొన్ని పోస్టులు, కామెంట్లు చేయడం చేశారు. అయితే విషయం కాస్త అనుప్రియ ద్రుష్టికి వెళ్లడంతో, తీవ్రంగా పరిగణించిన ఆమె ఢిల్లీ పోలీసు కమిషనర్ కు ఫేక్ ఎకౌంట్ పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

Newly inducted minister Anupriya Patel lodges complaint on fake twitter handles

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటినుంచి ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తతో వ్యవహరిస్తానన్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇకపోతే మొన్నీమధ్యే బీజేపీలో విలీనమైన ఉత్తరప్రదేశ్ అప్నాదళ్ కు చెందిన చీలిక వర్గం ఎంపీ అనుప్రియకు ఇటీవల కేంద్రమంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister of state for health and family plannig Anupriya Patel on wednesday lodged a complaint with Delhi Police. Hours after a tweet by a purported fake handle in her name targeting people from a community was trolled on the micro blogging site.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి