కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో పెళ్లి కూతురు ఎస్కేప్, అక్రమ సంబంధం, అవమానంతో ఆత్మహత్య!

చెన్నై: వివాహం జరిగిన 10 రోజుల పాటు భర్తతో సంతోషంగా ఉన్న పెళ్లి కూతురు సుమారు కేజీ నగలతో పక్కింటి ప్రియుడితో కలిసి పరారైయ్యింది. పెళ్లి కూతురు ఎస్కేప్ కావడంతో ఆమె ప్రియుడి మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చెయ్యడంతో అవమానంతో అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లేచిపోయిందని అవమానంతో కలక్టరేట్ లో ఉద్యోగం చేస్తున్న భర్త ఇంటికే పరిమితం అయ్యాడు. పెళ్లి పారాణి ఆరకముందు పెళ్లివ కుమార్తె వేరే వ్యక్తితో లేచిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. అయితే కేజీ నగలతో ప్రియుడితో పరారైన పెళ్లి కుమార్తె మాత్రం బెంగళూరులో స్నేహితుల ఇంటిలో తలదాచుకుందని గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

రూ. లక్షల ఖర్చుతో ఘనంగా పెళ్లి

రూ. లక్షల ఖర్చుతో ఘనంగా పెళ్లి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఇరుదాంకాట్టుకు చెందిన వేల్ మురుగన్ (29), పరచూరుకు చెందిన రాజేశ్వరి అనే యువతితో 20 రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు రూ. లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి కుమారుడు వేల్ మురుగన్ కన్యాకుమారి కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నాడు.

 పెళ్లి కూతురు రాజేశ్వరీకి కేజీ నగలు

పెళ్లి కూతురు రాజేశ్వరీకి కేజీ నగలు

పెళ్లి కుమార్తె రాజేశ్వరీకి ఆమె కుటుంబ సభ్యులు సుమారు 90 సవర్ల బంగారు నగలు చేయించారు. పెళ్లి సందర్బంగా రాజేశ్వరీకి ఆమె కుటుంబ సభ్యులు ఆ నగలు ఇచ్చారు. పెళ్లి జరిగిన సుమారు 10 రోజుల పాటు రాజేశ్వరి భర్త వేల్ మురుగన్ తో చాలా సంతోపంగా ఉంది. వేల్ మురుగన్, రాజేశ్వరీ కలిసి హాయిగా సినిమాలు, షికార్లకు వెళ్లారు.

కేజీ నగలతోపెళ్లి కూతురు ఎస్కేప్

కేజీ నగలతోపెళ్లి కూతురు ఎస్కేప్

వారం రోజుల క్రితం రాజేశ్వరీ ఇంటి నుంచి బయటకు వెళ్లి పత్తాలేకుండా పోయింది. రాజేశ్వరీతో పాటు ఇంటిలో ఉన్న సుమారు కేజీ బంగారు నగలు, 20 వేల రూపాయల నగదు మాయం కావడంతో వేల్ మురుగన్ కుటుంబ సభ్యులు హడలిపోయారు. రాజేశ్వరీ కోసం బంధువులు, కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆమె స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది. తన భార్య రాజేశ్వరీ కనపడటం లేదని వేల్ మురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 పక్కింటి ప్రియుడితో పెళ్లి కూతురు!

పక్కింటి ప్రియుడితో పెళ్లి కూతురు!

రాజేశ్వరీ మాయం అయిన రోజు నుంచి ఆమె పక్కింటిలో నివాసం ఉంటున్న సంతోష్ కూడా మాయం అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి కూతురు రాజేశ్వరీ, పక్కింటి యువకుడు సంతోష్ ఒకే రోజు మాయం కావడంతో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సంతోష్ కోసం గాలించినా పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం లభించలేదు.

బెంగళూరులో ఫ్రెండ్స్

బెంగళూరులో ఫ్రెండ్స్

సంతోష్ కు బెంగళూరు నగరంలో గోవు అనే యువకుడితో పాటు అనేక మంది స్నేహితులు ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు గోవును విచారణ చెయ్యగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంతోష్ ను అతని పక్కింటిలో నివాసం ఉంటున్న రాజేశ్వరీ అనేక సంవత్సరాల నుంచి ప్రేమిస్తోందని గోవు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంతోష్, రాజేశ్వరీతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని గోవు పోలీసులకు చెప్పాడు.

నిరుద్యోగితో లవ్ ఏమిటి ?

నిరుద్యోగితో లవ్ ఏమిటి ?

ఎలాంటి ఉద్యోగం చెయ్యకుండా తల్లిదండ్రులు సంపాధిస్తున్న డబ్బుతో కాలం గడుపుతున్న సంతోష్ తో నీకు ప్రేమ, పెళ్లి ఏమిటని రాజేశ్వరీ కుటుంబ సభ్యులు ఆమెను మందలించారని తెలిసింది. సంతోష్ కు ఉద్యోగం లేకపోవడంతో తండ్రి చెప్పినట్లుగా రాజేశ్వరీ వేల్ మురుగన్ ను పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ప్రియుడిని మరిచిపోలేక

ప్రియుడిని మరిచిపోలేక

తండ్రి చెప్పినట్లు వేల్ మురుగన్ ను వివాహం చేసుకున్న రాజేశ్వరీ ప్రియుడు సంతోష్ ను మరిచిపోలేక అతనితో కలిసి పారిపోయిందని పోలీసులు అంటున్నారు. స్నేహితుల సహాయంతో బెంగళూరులో తలదాచుకున్న సంతోష్, రాజేశ్వరీల కోసం కన్యాకుమారీ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే సంతోష్ స్నేహితుడు గోవును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారు.

అవమానంతో తండ్రి ఆత్మహత్య

అవమానంతో తండ్రి ఆత్మహత్య

రాజేశ్వరీ భర్త వేల్ మురుగన్ ఫిర్యాదు చెయ్యడంతో ప్రియుడు సంతోస్ మీద పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేజీ నగలతో పెళ్లి కుమార్తె రాజేశ్వరీని లేపుకుపోయాడని సంతోష్ మీద కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అతని తండ్రి జగదీశన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన సంతోష్ కుటుంబ సభ్యులు జగదీశన్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై జగదీశన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తండ్రి మరణించాడని సమాచారం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నా సంతోష్ ఆచూకి చిక్కడం లేదని పోలీసులు అంటున్నారు. కేజీ నగలతో ప్రియుడు సంతోష్ తో పారిపోయిన రాజేశ్వరీ కోసం బెంగళూరు నగరంలో తమిళనాడు పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+