తొలి రాత్రి: భర్తతోపాటు అత్తింటికి షాకిచ్చిన నవవధువు, ఇంతకీ ఏం చేసిందంటే.?

లక్నో: తనకు కాబోయే భార్య, తమకు కాబోయే కోడలు మంచి గుణవతి అయితే చాలు అనుకున్నారు ఓ యువకుడు, అతని కుటుంబసభ్యులు. ఈ నేపథ్యంలోనే ఓ మధ్యవర్తి సాయంతో ఆ యువకుడికి ఓ అందమైన యువతితో పెళ్లి చేశారు. అయితే, పెళ్లైన తొలి రాత్రే భర్తతోపాటు అత్తంటికి వారికి షాకిచ్చి పారిపోయింది ఆ నవవధువు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గుణవంతురాలైతే చాలని..

గుణవంతురాలైతే చాలని..

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడాన్ జిల్లా ఛోటాపారా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడికి మంచి గుణవతి అయిన అమ్మాయితో పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అయినా పరవాలేదని అనుకున్నారు. ఓ మధ్యవర్తికి సంబంధం చూసే బాధ్యతను అప్పగించారు.

మధ్యవర్తి తెచ్చిన సంబంధం..

మధ్యవర్తి తెచ్చిన సంబంధం..

టింకూ అనే మధ్యవర్తి తమకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉందంటూ.. రియా అనే అమ్మాయి ఫొటోను చూపించాడు. ఆమె అందమైన యువతే కాదు గుణవంతురాలు అని కూడా ప్రవీణ్ కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే, ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబమని, కనీసం పెళ్లి చేసేందుకు కూడా డబ్బులు లేవని చెప్పుకొచ్చాడు.

అమ్మాయిని చూసి.. అంతా ఓకే చేసిన అబ్బాయి..

అమ్మాయిని చూసి.. అంతా ఓకే చేసిన అబ్బాయి..

ఈ క్రమంలో రియాను చూసిన ప్రవీణ్.. ఆమెపై మనసు పారేసుకున్నాడు. పెళ్లి ఖర్చులు అన్నీ తామే భరిస్తామని, వారికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రవీణ్ టింకూకు చెప్పాడు. దీంతో వీరి పెళ్లి నిశ్చయమైంది. అయితే, పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో అమ్మాయి కుటుంబానికి బట్టలు, నగలు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేవంటూ టింకూ మళ్లీ ప్రవీణ్ కుటుంబానికి తెలిపాడు. దీంతో కరిగిపోయిన ప్రవీణ్.. కుటుంబసభ్యులతో మాట్లాడి రూ. 4 లక్షలు ఇచ్చి పంపించాడు.

అంగరంగ వైభవంగా పెళ్లి.. తొలి రాత్రే..

అంగరంగ వైభవంగా పెళ్లి.. తొలి రాత్రే..

ఇక డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా రియా, ప్రవీణ్ వివాహం జరిగింది. లక్షలు ఖర్చు అజంగడ్‌లో వీరి వివాహాన్ని ఘనంగా చేశారు. పెళ్లి తర్వాత అంతా కలిసి వరుడు ప్రవీణ్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి రియా.. అత్తింటి వారికి షాకిచ్చింది. ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. ప్రవీణ్, అతని కుటుంబసభ్యులకు మత్తు మందు ఇచ్చి.. వారింట్లోని నగదు, విలువైన నగలతో ఉడాయించింది.

నవ వధువు, మధ్యవర్తిపై ఫిర్యాదు..

నవ వధువు, మధ్యవర్తిపై ఫిర్యాదు..

మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన ప్రవీణ్ కుటుంబసభ్యులు.. జరిగిన విషయం తెలుసుకుని లబోదిబోమన్నారు. ఆ తర్వాత అజంగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కూతురు రియా రూ. 70వేల నగదు, రూ. 4లక్షల విలువైన బంగారు ఆభరణాలను అపహరించి పారిపోయిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మధ్యవర్తి టింకూ కూడా కనిపించడం లేదంటూ అతనిపై కూడా అనుమానం ఉందని ఫిర్యాదులో తెలిపారు.

పరువు తీసిందంటూ నవవరుడి ఆవేదన..

పరువు తీసిందంటూ నవవరుడి ఆవేదన..

బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎంతో నమ్మిన రియా తమను ఇంత ఘోరంగా మోసం చేస్తుందని అనుకోలదేని, ఆమెను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నవ వరుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. రియా చేసిన పనితో తమ కుటుంబం పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+