నవవధూవరులకు యోగి ప్రభుత్వం బంపర్ ఆఫర్: పెళ్లి జరిగే ప్రతి చోట, ఏమిస్తారో తెలుసా ?

యోగి ఆధిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నవవధూవరుకులకు బహుమతులు అందజేసే కొత్త స్కీం ప్రవేశ పెట్టింది. ఉత్తరప్రదేశ్ లో ఏ మారుమాల గ్రామాల్లో పెళ్లి జరుగుతున్నా అక్కడికి ప్రభుత్వ అధికార

లక్నో: యోగి ఆధిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నవవధూవరుకులకు బహుమతులు అందజేసే కొత్త స్కీం ప్రవేశ పెట్టింది. ఉత్తరప్రదేశ్ లో ఏ మారుమాల గ్రామాల్లో పెళ్లి జరుగుతున్నా అక్కడికి ప్రభుత్వ అధికారులతో సహ ఆశ కార్యకర్తలు హాజరౌతారు.

ఇంత వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోని సరికొత్త స్కీంను యోగీ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది. పెళ్లి చేసుకుంటున్న దంపతులు, వారి కుటుంబ సభ్యులు సహజంగా ఖరీదైన బహుమతులు, లేదా చదివింపులు (నగదు) వస్తాయని అనుకుంటారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎవ్వరూ ఊహించిన బహుమతులు ఇస్తోంది.

Newly weds to get condoms as shagun from Uttar Pradesh government

నవవధూవరులకు నిరోద్, గర్బనిరోధక మాత్రలు ఉన్న కిట్ అందించి ఆల్ ద బెస్ట్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. నిరోద్, గర్బనిధోక మాత్రలు ఉన్న కిట్ లో టవల్, చేతి రుమాలు, నెయిల్ కటర్, కాటుక, అద్దంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ఓ పత్రం ఉంటుంది.

ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన ప్రతంలో పెళ్లి చేసుకున్న తరువాత కుటుంబ బాధ్యతలు ఎలా చూసుకోవాలి, పుట్టిన పిల్లలను ఎలా చూసుకోవాలి ? పిల్లలకు కావలసిన సదుపాయాలు ఎలా చూసుకోవాలి ? అంటూ చివరికి పెరిగిపోతున్న జనాబాను ఎలా అరికట్టాలి అనే పూర్తి వివరాలతో ముద్రించిన పత్రం నవవధూవరులకు ఇస్తున్నారు.

అంతే కాకుండా ఆ కిట్ తీసుకున్న నవవధూవరుల అభిప్రాయం ఏమిటి ? అని తెలుసుకుంటున్న అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెలుతున్నారు. మొత్తం మీద జనాబా తగ్గించడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరికొత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసిందని ఉత్తరప్రదేశ్ లో చర్చ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+