పెద్దల అంగీకారంతో పెళ్లి..శోభనం రోజునే బిగ్ ట్విస్ట్
ఓ జంట పెద్దల అంగీకారంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. శోభనం గదిలోకి నవ్వుతూ లోపలికి వెళ్లిన ఆ జంట తెల్లారి లేచి చూసేసరికి చనిపోయి కనిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ్ నగరంలో చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సహదత్‌గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్‌కు సమీప ప్రాంతానికి చెందిన శివానితో వివాహం జరిపించారు. ఇద్దరి అంగీకారంతోనే ఈ వివాహం జరిగింది. పెళ్లి తతంగంలో నూతన జంట నవ్వుతూనే కనిపించారు.
ఇక శోభనం గదిలోకి నవ్వుతూ వెళ్లిన ఈ జంట తెల్లారే సరికి శవమై కనిపించారు. శోభనం గదిలోకి వెళ్లిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మరుసటి రోజూ ఎంతకు బయటకు రాలేదు. ఫోన్ చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్ పగులకొట్టి చూడగా ఇద్దరు చనిపోయి కనిపించారు.వధువు శివాని మంచంపై పడిపోయి ఉండగా.. వరుడు ప్రదీప్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా, ఇద్దరూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

దీంతో పెళ్లి జరిగిన ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే అసలు వారు ఎందుకు చనిపోయారో కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు.
ఈ ఘటనపై వరుడి అన్నయ్య దీపక్ కుమార్ మాట్లాడుతూ..ఇద్దరి అంగీకారంతో ఆరు నెలల క్రితం పెళ్లి ఫిక్స్ చేశామని తెలిపాడు. పెళ్లి సమయంలో కూడా వారిద్దరూ ఆనందంగా ఉన్నారని అతను పేర్కొన్నాడు. అందరం కలిసే భోజనం చేశామని, ఇంతలోనే ఇలా జరిగిందని పెళ్లి కొడుకు అన్నయ్య దీపక్ కుమార్ వాపోయాడు.
మరోవైపు శోభనం గదిలో ఎలాంటి గొడవ కూడా జరిగినట్టు లేదని పోలీసులు తెలిపారు.గదిలో ఎటువంటి ఆయుధాలు గానీ, మరే ఇతర అనుమానాస్పద వస్తువు గానీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పెళ్లి కూతురు శివాని మెడపై గుర్తులు కనిపించాయని, వధువును చంపి ప్రదీప్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వారిద్దరి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications