ఫస్ట్ నైట్ రోజే మెగుడికి మస్కా.. నవ వధువు చేసిన పని తెలిస్తే..
సినిమా రేంజ్ ను తలపించేలా నిజ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి సినిమాలకు మించిన ట్విస్టులు రియల్ లైఫ్ లో కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓ నవ వధువు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్ లోని కిషన్ ఘడ్ లో జరిగింది.
రాజస్థాన్ లోని కిషన్ గఢ్ లో జరిగిన పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగ్రాకు చెందిన నవ వధువు ఫస్ట్ నైట్ రోజే వరుడి ఇంట్లోని బంగారం, డబ్బుతో జంప్ అయింది. దీంతో వరుడి ఫ్యామిలీ లబోదిబోమని ఏడుస్తోంది. ఇదే విషయం గురించి వరుడు వివరించాడు. తనకు ఓ బ్రోకర్ ద్వారా ఈ సంబంధం వచ్చినట్లు తెలిపాడు. ఈ పెళ్లి కుదుర్చినందుకు జితేంద్ర అనే బ్రోకర్ రూ. 2 లక్షలు తీసుకున్నట్లు వివరించాడు. పెళ్లి జైపుర్ లో సంప్రదాయ పద్ధతిలో జరిగిందని వివరించాడు.

అయితే పెళ్లి తర్వాత తమ సంప్రదాయం ప్రకారం వరుడి తల్లి నవ వధువుకు బంగారం నెక్లేస్, ఆభరణాలు ఇచ్చారు. ఇక ఫస్ట్ నైట్ రోజు వధూవరులు ఇద్దరూ ఒకే రూమ్ లోకి వెళ్లగా.. వరుడికి ఆ వధువు మాయమాటలు చెప్పింది. తమ ఆచారం ప్రకారం ఇద్దరం ఒకే దగ్గర పడుకోవద్దని తెలిపింది. అయితే ఈ విషయాన్ని వరుడితోపాటు అతడి కుటుంబం నిజమేనని భావించింది. అలా రాత్రి 3 గంటల సమయంలో నీళ్ల కోసం నిద్రలేచిన నవ వధువు ఇంట్లోని బంగారం, డబ్బుతో జంప్ అయింది.
వధువు కోసం ఊరు మొత్తం వెతికినా కనిపించలేదు. దీంతో మదన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు బ్రోకర్ జితేంద్ర కూడా మిస్సింగ్ అయ్యాడు. దీంతో వీరిద్దరూ పక్కాగా ప్లాన్ ప్రకారం ఈ కథ నడిపించినట్లు పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications