“నన్ను చంపేస్తారు”.. నవవధువు లాస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ !
కొత్తగా పెళ్లి చేసుకొని వివాహ బంధం లోకి అడుగుపెట్టింది ఓ నవ వధువు. కానీ పెళ్లి జరిగి నాలుగు నెలలు కాకముందే ఆమె కన్న కలలు ఆవిరైపోయాయి. చివరికి బ్రతకడమే భారంగా మారి.. తన అత్తమామలు, బావమరిది.. భర్త చంపాలని చూస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యింది. తన చివరి మాటలను సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఉరి వేసుకొని ప్రాణాల్ని విడిచింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకోగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
అనురాగ్ సింగ్.. బక్షీ కా తలాబ్ పోలీస్ స్టేషన్‌లో ఈగల్ మొబైల్ యూనిట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సౌమ్య కశ్యప్ (25) అనే అమ్మాయిని నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత అత్తమామలు, భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎదురయ్యాయి. సౌమ్య తన స్నేహితులకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సౌమ్య నిన్న (జూలై 27, 2025) రాత్రి తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు ముందు సౌమ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన 'చివరి వీడియో' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో పోస్ట్..
చివరి వీడియోలో సౌమ్య ఆవేదనతో మాట్లాడిన మాటలు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. "నా అత్తమామలు, బావమరిది, నా భర్త అనురాగ్ సింగ్ నన్ను చంపాలని చూస్తున్నారు. ఆయన మరో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు" అని తెలిపింది. తన భర్త మామ ఒక లాయర్ అని.. తనను చంపినా కూడా కోర్టు కేసుల్లో కాపాడతానని బెదిరించారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా వీడియోలో తన శరీరంపై ఉన్న గాయాలను సైతం చూపించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో తీవ్ర కలకలం రేపింది. సౌమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అనురాగ్ సింగ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెటిజన్లు సైతం వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications