వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెక్ట్స్ బెంగాల్: అమిత్ షా గురి, అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. తమిళనాడులో కూడా..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ మాంచి ఊపుమీదుంది. ఇక వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై ఫోకస్ చేసింది. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్‌లో అధికారం చేపట్టాలని బీజేపీ ఊవ్విళ్లూరుతోంది. బెంగాల్‌లో ఇప్పటినుంచే కార్యాచరణ చేపడుతోంది. వ్యుహకర్త అమిషా రంగంలోకి దిగారు. మెజార్టీ సీట్లు సాధించాలనే వ్యుహాంతో ముందుకెళ్తున్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కొలా..?

ఒక్కో రాష్ట్రంలో ఒక్కొలా..?

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహం.. ఇదే బీజేపీ విజయరహస్యం. ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చాపకింద నీరులా ప్రచారం చేయడమే ఆ పార్టీ నైజం. ఇలా చేయడం వల్ల గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో18 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అప్పటినుంచి టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. అయినాప్పటికీ అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఇటీవల రాష్ట్రంలో రెండ్రోజులపాటు పర్యటించారు.

అవినీతి, అక్రమాలు

అవినీతి, అక్రమాలు

బెంగాల్లో అవినీతి, శాంతిభద్రతలు, బీజేపీ కార్యకర్తల హత్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. టీఎంసీ, కాంగ్రెస్‌, వామపక్షాల్లో అసంతృప్తికి లోనవుతున్న నాయకులను తమ పార్టీలో బీజేపీ చేర్చుకుంటోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10 శాతం ఓట్లతో మూడు స్థానాలను మాత్రమే కైవసం చేసుకున్న ఆ పార్టీ... 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40.64 శాతం ఓట్లను సాధించి.. 18 స్థానాలను గెలుచుకుంది.

తమిళనాడులో కూడా..

తమిళనాడులో కూడా..

తమిళనాడులో కూడా పాగా వేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే నేత జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనతో పూరించాలని చూసింది. అన్నాడీఎంకేను చీల్చే ప్రయత్నం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీచేసినా.. బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను పదునుపెడుతోంది.

Recommended Video

#Biharelectionresults2020: 'Voter's Priority Is Only Development' - PM Modi
రజనీకాంత్‌తో కలిసి..?

రజనీకాంత్‌తో కలిసి..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వంటి వారిని తమ పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారంలోకి వచ్చే సత్తా లేకపోయినా.. గణనీయమైన సీట్లు సాధించి తన ప్రాభవాన్ని చాటుకోవాలని చూస్తోంది. అన్నాడీఎంకేతో జట్టుకట్టి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆ పార్టీ వ్యూహకర్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

English summary
bjp next target west bengal and tamilnadu. next year these states have assembly elctions. home minister amith shah looks in the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X