వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు, తాజా సర్వే: అక్కడ ఓటు బీజేపీకే, అక్కడ కాంగ్రెస్ హవా, జేడీఎస్ చక్రం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ రానుందని, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్జీ మైండ్ ప్రేమ్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

'జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం, అక్కడ 18 స్థానాలు లక్ష్యం''జేడీఎస్ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం, అక్కడ 18 స్థానాలు లక్ష్యం'

బీజేపీ పార్టీకి 75 నుంచి 85 సీట్లు, జేడీఎస్‌కు 35 నుంచి 41 సీట్లు, ఇతరులకు 4 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందిని భాగం చేస్తూ ఈ సర్వే చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. సిట్టింగ్‌లకే ఓటేయాలని నిర్ణయించినట్లు ఎక్కువ మంది ఓటర్లు వెల్లడించారు.

 సర్వే ఎలా చేశారంటే?

సర్వే ఎలా చేశారంటే?

ఈ సర్వేలో ఎవరికి ఓటు వేస్తున్నారు? ప్రాజెక్టులు, పౌరసరఫరా, ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజల అభిప్రాయం, నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదరణ తదితరాల ఆధారంగా సర్వే చేశారు. అభిప్రాయ సేకరణకు ప్రత్యేక యాప్ ఉపయోగించారు. 30 జిల్లాల్లోని 224 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. ముంబై కర్నాటక, కోస్తా కర్ణాటక, హైదరాబాద్ కర్నాటక, మధ్య కర్నాటక, పాత మైసూర్ అన్ని ప్రాంతాల్లో సర్వే చేశారు.

 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కింగ్ మేకర్ జేడీఎస్

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కింగ్ మేకర్ జేడీఎస్

కాంగ్రెస్ పార్టీకి 39.47 శాతం ఓట్లు, బీజేపీకి 36.28 శాతం ఓట్లు, జేడీఎస్‌కు 21.83 శాతం ఓట్లు, ఇతరులకు 2.42 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంటుందని తేలింది. కర్నాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మరో పార్టీతో చేతులు కలపాల్సిన పరిస్థితి తప్పనిసరి అని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సీట్ల పోటీ ఉండటంతో జేడీఎస్ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని కింగ్ మేకర్‌గా అవతరించనుందని తేలింది. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా 113 సీట్లు కావాలి.

ఎంత మెజార్టీతో గెలుస్తారంటే?

ఎంత మెజార్టీతో గెలుస్తారంటే?

విజేతలు ప్రత్యర్థులపై సాధించే ఓట్ల శాతం కూడా ఎక్కువగా ఉంటుందని తేలింది. ప్రత్యర్థులపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 5 శాతం ఓట్ల ఆధిక్యంతో 22 చోట్లు, 5 నుంచి 10 శాతం ఓట్ల ఆధిక్యంతో 27 చోట్ల, పది శాతానికి పైగా ఓట్ల ఆధిక్యంతో 63 చోట్ల గెలుస్తారని తేలింది. బీజేపీ ఐదు శాతం ఓట్ల మెజార్టీతో 8 చోట్ల, 5 నుంచి 10 శాతం ఓట్ల మెజార్టీతో 11 చోట్ల, పది శాతాని కంటే ఎక్కువ ఓట్లతో 56 చోట్ల గెలుస్తారని తేలింది. జేడీఎస్ విషయానికి వస్తే 5 శాతం ఓట్లతో 4 శాతం, 5 నుంచి 10 శాతం ఓట్లతో ముగ్గురు, 10 శాతానికి పైగా ఓట్లతో 30 మంది ఉంటారని తేలింది.

ముఖ్యమంత్రిగా ఎవరు బెట్టర్ అంటే?

ముఖ్యమంత్రిగా ఎవరు బెట్టర్ అంటే?

ముఖ్యమంత్రిగా ఎవరు బెట్టర్ అంటే ఎక్కువ మంది సిద్ధరామయ్యకు ఓటేశారు. ఆయనకు 41 శాతం మంది మద్దతు పలకగా, 33 శాతం మంది యెడ్యూరప్పకు అనుకూలంగా చెప్పారు. 23 శాతం మంది కుమారస్వామి సీఎంగా కావాలంటే, మూడు శాతం మంది ఎవరైనా ఒకటే అని చెప్పారు. జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారనుందని తేలింది.

 ముంబై కర్నాటకలో కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ

ముంబై కర్నాటకలో కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ

మెజార్టీ లింగాయత్‌లో ఓటు బ్యాంక్ ముంబై కర్నాటక ప్రాంతంలో ఉంది. ఇక్కడ 50 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా ప్రకటించినందున కాంగ్రెస్ వారి ఓటు బ్యాంకుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. లింగాయత్‌లు మొదటి నుంచి బీజేపీకి అండగా ఉన్నారు. అయితే, ఇక్కడ పోటాపోటీ కనిపిస్తున్నాయి. ఇక్కడి 50 స్థానాల్లో కాంగ్రెస్ 25, బీజేపీ 24, జేడీఎస్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది. కానీ సీట్ల విషయంలో కాంగ్రెస్ ఒక స్థానం ముందంజలో ఉంది. కాంగ్రెస్‌కు 39.4 శాతం, బీజేపీకి 46 శాతం, జేడీఎస్‌కు 13.5 శాతం ఓట్లు రానున్నాయి. 2004, 2008లో బీజేపీ ఇక్కడ పూర్తి ఆధిపత్యం సంపాదించింది. కానీ 2013లో కాంగ్రెస్ గండి కొట్టింది.

మధ్య కర్నాటక బీజేపీ-కాంగ్రెస్‌లకు సమానంగా సీట్లు

మధ్య కర్నాటక బీజేపీ-కాంగ్రెస్‌లకు సమానంగా సీట్లు

మధ్య కర్నాటకలో 35 సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్‌లు, మఠాలు గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు చెరీ 15 స్థానాలు, జేడీఎస్ 5 స్థానాలు గెలుచుకుంటాయని తెలింది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్‌కు 39.2 శాతం, బీజేపీకి 40.6 శాతం, జేడీఎస్‌కు 18.7 శాతం రానున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు రానున్నాయి.

పాత మైసూరులో కాంగ్రెస్ వర్సెస్ జెడీఎస్

పాత మైసూరులో కాంగ్రెస్ వర్సెస్ జెడీఎస్

పాతమైసూరులో 87 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య పోరు కొనసాగుతుందని తేలింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 48, బీజేపీకి 14, జేడీఎస్‌కు 25 స్థానాలు వస్తాయని తేలింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 40.3 శాతం, బీజేపీకి 27.3 శాతం, జేడీఎస్‌కు 29.8 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

హైదరాబాద్ కర్నాటక కాంగ్రెస్ హవా

హైదరాబాద్ కర్నాటక కాంగ్రెస్ హవా

హైదరాబాద్ కర్నాటక 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 10, జేడీఎస్‌కు 6 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్‌కు 38.20 శాతం, బీజేపీకి 35 శాతం, జేడీఎస్‌కు 21.60 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

కోస్తా కర్నాటక బీజేపీ హవా

కోస్తా కర్నాటక బీజేపీ హవా

కోస్తా కర్నాటకలో 21 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 9, బీజేపీకి 12 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 122 మంది, బీజేపీ, జేడీఎస్‌లకు చెరో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఓటు వేస్తామని 56 శాతం మంది చెప్పగా, 44 శాతం మంది ఓటు వేయమని చెప్పారు. పాలనాయంత్రాంగం అవినీతిలో కూరుకుపోయిందని 65 శాతం మంది అంటే, 35 శాతం మంది కాదన్నారు.

 ఇదీ ఎన్జీ-మైండ్ ఫ్రేమ్ గత రికార్డ్

ఇదీ ఎన్జీ-మైండ్ ఫ్రేమ్ గత రికార్డ్

ఎన్జీ-మైండ్ ఫ్రేమ్ తొలి సర్వే తన తొలి సర్వేను వరంగల్ ఉప ఎన్నికల్లో నిర్వహించింది. 58 శాతం ఓట్లు టీఆర్ఎస్ వస్తాయని చెప్పగా, 59 శాతం ఓట్లు ఆ పార్టీ సాధించింది. జీహెచఎంసీ ఎన్నికల్లోను టీఆర్ఎస్‌కు 91 సీట్లకు పైగా వస్తాయని అంచనా వేసింది. టీఆర్ఎస్ 99 సీట్లు సాధించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి 57 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. 56 శాతం ఓట్లతో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 125 నుంచి 135 సీట్లు వస్తాయని అంచనా వేయగా, 136 సీట్లు వచ్చాయి.

English summary
NG Mind Frame Karnataka Assembly 2018 Pre-Poll Survey Results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X