ఇంజనీరింగ్ చదివి ఢిల్లీలో ఏం చేస్తున్నాడంటే ?, హీరో అయిపోవాలని అనుకుంటే!
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జమ్‌ను దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక రాష్ట్రాలలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించడానికి ఎన్ఐఏ ( NIA)తో కలిసి పనిచేస్తున్న అనేక ఏజెన్సీలలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఒకటి అని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.
వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన షానవాజ్ ఐసిస్ పూణె మాడ్యూల్ కేసులో వాంటెడ్‌గా వాంటెడ్ క్రిమినల్ అని పోలీసు అధికారులు అంటున్నారు. ఎన్ఐఏ (NIA) వర్గాల సమాచారం ప్రకారం, షానవాజ్ వాస్తవానికి ఢిల్లీకి చెందినవాడు. గతంలో పూణెలో అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించడంతో తప్పించుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం ఢిల్లీకి పారిపోయి అక్కడి నుంచి రహస్య స్థావరంలో షనవాజ్ నివసించినట్లు తెలిసింది. ప్రస్తుతం షనవాజ్ ను అధికారులు విచారిస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో ఎన్ఐఏ (,NIA) అధికారులు షానవాజ్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాద నిందితులు రిజ్వాన్ అబ్దుల్ హాజీ అలీ, అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ దియాపర్వాలా మరియు తల్హా లియాఖత్ ఖాన్ గురించి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి రూ 3 లక్షల నగదు బహుమతిని ఇస్తామని ఇప్పటికే ఎన్ఐఏ (NIA) ప్రకటించింది. ఈ నలుగురూ మహారాష్ట్రలోని పూణెలో ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు (ISIS) చెందిన మాడ్యూల్‌తో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు చెప్పారు.
పూణెలో ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై తీవ్రవాద నిరోధక సంస్థ గత నెలలో పలువురిని అరెస్టు చేసింది. దేశంలో (India) శాంతికి, మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ఐఎస్‌ఐఎస్‌కి (ISIS) చెందిన పూణే యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ సంస్థ అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
అరెస్టు అయిన నిందితుల్లో ఒకరైన షామిల్ సాకిబ్ నాచన్ ఇంట్లో ఐఎస్ఐఎస్ (ISIS) కుట్రను బహిర్గతం చేసే నేరారోపణలను ఎన్ఐఏ ( NIA) స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. షామిల్ సాకిబ్ నాచన్ మరియు ఇతరులు మెరుగైన పేలుడు పరికరాలను తయారు చేయడంతో పాటు వాటిని అమర్చడం ద్వారా దేశవ్యాప్తంగా హింసను ప్రేరేపించే ప్రణాళికను కలిగి ఉన్నారని ఉగ్రవాద నిరోధక సంస్థ తెలిపింది.
నిందితులంతా ఐసిస్ (ISIS) స్లీపర్ మాడ్యూల్ సభ్యులని ఎన్ఐఏ తెలిపింది. దేశంలో ఇస్లామిక్ స్టేట్‌ను స్థాపించే లక్ష్యంతో ఉగ్రవాదం మరియు హింసను వ్యాప్తి చేయడానికి ఐసిస్ (ISIS0 ఎజెండాను కొనసాగించడానికి వారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని ప్లాన్ చేసారని ఎన్ఐఏ (NIA) ఏజెన్సీ తెలిపింది.












Click it and Unblock the Notifications