తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై రంగంలోకి ఎన్ఐఏ
చెన్నై: తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేపట్టింది. శనివారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు.. ప్రమాద ఘటనపై పరిశీలించారు. చెన్నై సమీపంలోని పొన్నేరి ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం రైలు పట్టాలపై దుండగులు వేసిన వైర్లు, సిగ్నల్ బోర్డులపై పెట్టిన హుక్స్‌ను గుర్తించిన రైల్వే సిబ్బంది వాటిని సరిచేశారు.
అప్పుడే కుట్ర జరిగి ఉంటుందనే అనుమానంతో ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. సిగ్నల్, మార్గం మధ్య మిస్ మ్యాచ్ ప్రమాదానికి కారణమైందని తెలిపారు.

మెయిన్ లైన్లోకి వెళ్లేలా సిగ్నల్ ఇచ్చినప్పటికీ ట్రాక్ మాత్రం రైలును క్లోజ్ లూప్ వైపు మళ్లించిందని వెల్లడించారు. ఎక్కడో జరిగిన తప్పు కారణంగానే గూడ్స్ రైలు ఆగివున్న ట్రాక్ పైకి ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లినట్లు దక్షిణ రైల్వే జీఎం సింగ్ తెలిపారు. అయితే, ఖచ్చితంగా ఏం జరిగిందనేది దర్యాప్తు అనంతరం తెలుస్తుందని చెప్పారు.
మరోవైపు, రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రైల్వే భద్రతా విభాగానికి చెందిన సీనియర్ అధికారుల బృందం సందర్శించింది. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. ట్రాక్ తోపాటు పాయింట్లు, బ్లాక్స్, సిగ్నళ్లను, స్టేషన్ లోని ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్, కంట్రోల్ ప్యానల్స్, భద్రతకు సంబంధించిన ఇతర ముఖ్య అంశాలను రైల్వే భద్రతా విభాగం అధికారులు పరిశీలించారు.
కాగా, శుక్రవారం మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 13 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. రెండో బోగీల్లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక గ్రామాల ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications