ఉగ్రదాడి: ఎస్పీకి లైడిటెక్టర్ పరీక్షలు ! (ఫోటోలు)
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పంజాబ్ ఎస్పీని విచారణ చేస్తున్నారు. సోమవారం ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయంలో ఎస్పీ సల్వీందర్ సింగ్ ను 8 గంటల పాటు విచారణ చేశారు.
అయితే సరైన సమాచారం రాకపోవడంతో మళ్లి మంగళవారం విచారణకు హాజరుకావాలని అధికారులు సూచించారు. మంగళవారం ఎస్పీ సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారుల ముందు హాజరై విచారణ ఎదుర్కున్నారు.
ఎస్పీ విచారణకు సహకరించడం లేదని, పొంతనలేని సమాచారం చెబుతున్నాడని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఎస్పీ సల్వీందర్ సింగ్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని ఎన్ఐఏ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.

కేంద్రం అనుమతి !
ఎస్పీ సల్వీందర్ సింగ్ కు లై డిటెక్టర్ పరిక్షలు నిర్వహించడానికి కేంద్రం ఎన్ఐఏ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు
పఠాన్ కోట్ దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని ఎస్పీ సల్వీందర్ సింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

కిడ్నాప్ ముందు.... తరువాత
కిడ్నాప్ కు ముందు, తరువాత జరిగిన సంఘటనలపై సల్వీందర్ సింగ్ చెప్తున్న కథనాల్లో పొంతనలేని అంశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

పూర్తి వివరాలకు రెండో రోజు
పూర్తి వివరాలు బయటకు లాగడానికి మంగళవారం ఎస్పీ సల్వీందర్ సింగ్ ను మళ్లి విచారించారు. ఆయనకు త్వరలో లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

వంట మనిషి, స్నేహితుడి విచారణ
ఇదే సందర్బంలో సల్వీందర్ సింగ్ వంట మనిషి మదన్ గోపాల్, స్నేహితుడు వర్మను అధికారులు పిలిపించి వేరు వేరుగా విచారణ చేశారు.

బదిలీ చేశారు
గురుదాస్ పుర్ పోలీస్ స్టేషన్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో అప్పటి అక్కడి ఎస్పీ సల్వీందర్ సింగ్ మీద అనుమానాలు వ్యక్తం కావడంతో బదిలీ చేశారు.

సాయుధ బలగాల కమాండెంట్ గా
ఎస్పీ సల్వీందర్ సింగ్ ను పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్ కు అసిస్టెంట్ కమాండెంట్ గా బదిలి చేశారు. అయితే ఆయన మాత్రం గురుదాస్ పురలోనే మకాం వేశారు.

అతనే కీలక సూత్రధారి ?
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరగడానికి ఉగ్రవాదులకు సల్వీందర్ సింగ్ పూర్తిగా సహకరించాడని, అతని కారు వారికి ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి.

రెండు రోజుల్లో క్లారిటి
రెండు రోజుల్లో సల్వీందర్ సింగ్ నుంచి పూర్తి వివరాలు బయటకు లాగుతామని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అంటున్నారు.

కష్టకాలంలో ఎస్పీ
ఎస్పీ సల్వీందర్ సింగ్ చెయ్యరాని పని చేసి కష్టాలు కొని తెచ్చుకున్నాడని పంజాబ్ లోని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications