పుల్వామా ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనా? NIA ఏమంటోంది?
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్‌ఐఏ.. పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ధృవీకరించింది. ఆ మేరకు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు ఎన్‌ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్ తో పాటు మరో నలుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడిలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.

విచారణ స్పీడప్.. పాక్ పనే
పుల్వామా ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ స్పీడప్ చేసింది. ఆ దాడిలో మారుతి ఈకో వాహనం వాడినట్లు గుర్తించారు అధికారులు. ఆ వెహికిల్ కు సంబంధించిన యజమానిని ఇప్పటికే గుర్తించారు. ఇది దాదాపు ఎనిమిదేళ్ల కిందటే కశ్మీర్ లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తన వాహనం వినియోగించుకుంటున్నారనే సమాచారం ఓనరుకు తెలుసంటున్నారు ఎన్‌ఐఏ అధికారులు. టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత వాహన యజమాని కనిపించకుండా పోయాడని చెబుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో పుల్వామా దాడి ఘటనలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడిస్తున్నారు.

ఆర్డీఎక్స్ ఎక్కడిది?
2018, మార్చి నెల నుంచి పత్తా లేకుండా పోయిన ఆదిల్ అహ్మద్ దార్.. అప్పటినుంచి కూడా జైషే మహమ్మద్ సంస్థకు పనిచేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తేల్చారు. పుల్వామా దాడి ఘటనలో వినియోగించిన వాహనంలో 25 కిలోల ఆర్టీఎక్స్ నింపినట్లు గుర్తించారు. అయితే ఇది ఉగ్రవాదులకు ఎలా చేరిందనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. సరిహద్దు ఆవలి వైపు నుంచే ఈ ఆర్డీఎక్స్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

కక్షతోనే అలా..!
2018, జూన్ లో సీఆర్పీఎఫ్ సైనికులు ఆదిల్ అహ్మద్ దార్ ఇంటిని కనిపెట్టారు. ఆ క్రమంలో ఆదిల్ ఉంటున్న ఇంటిని తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ తతంగాన్ని సీరియస్ గా తీసుకున్న ఆదిల్.. జవాన్లపై కక్ష పెంచుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారుల విచారణలో తేలింది. ఆ ఘటన జరిగిన వెంటనే ఆపరేషన్ బదర్ పేరుతో భద్రతా బలగాలపై జైషే టెర్రరిస్టులు గ్రెనేడ్ దాడులతో తెగబడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications