మాజీ సీఎం ఆరోగ్యం గురించి ఆయన కొడుకు, సినీ హీరో ఏం చెప్పారంటే !
బెంగళూరు: తీవ్ర అనారోగ్యం, జ్వరం కారణంగా ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చిన్న స్ట్రోక్‌కు గురైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, సినీ హీరో, రాజకీయ నాయకుడు నిఖిల్ కుమారస్వామి చెప్పారు. తన తండ్రి హెచ్ డీ. కుమారస్వామి ఆరోగ్యం గురించి గురువారం నిఖిల్ కుమారస్వామి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.
దీనిపై గురువారం నిఖిల్ కుమారస్వామి వరుస ట్వీట్ లు చేస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తన తండ్రి హెచ్ డీ, కుమారస్వామి ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. కుమారస్వామి అభిమానులు, జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉండాలని కుమారస్వామికి ఏమీ కాదని, ఆయన త్వరగా కోలుకుంటారని నిఖిల్ కుమారస్వామి అన్నారు.

ప్రస్తుతం మాజీ సీఎం కుమారస్వామిని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారని, త్వరలో ఇంటికి చేరుకుంటారని ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి వివరించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారని, జేడీఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుమాడు నిఖిల్ కుమారస్వామి వివరించారు.


అలాగే మా నాన్నగారి ఆరోగ్యం గురించి ఆరా తీసిన వివిధ మఠాల స్వామీజీలకు, ఆయన యోగక్షేమాలు అడిగిన వివిధ పార్టీల సీనియర్ రాజకీయ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని జేడీఎస్ పార్టీ నాయకుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మొదలైన తరువాత నుంచి మాజీ సీఎం హెచ్ డీ, కుమారస్వామి ఇప్పుడు రెండోసారి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications