దుర్గాష్టమి: డోల్ వాయించిన భర్త, ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసిన టీఎంసీ ఎంపీ నుష్రత్.. (వీడియో)

దసరా, దివాళి వేడుకలంటే బెంగాల్‌కు పెట్టింది పేరు. అక్కడ ప్రతీ ఒక్కరు భవానీ మాత కోసం ఉపవాసం ఉంటారు. దసరా, దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. దుర్గాష్టమి, మహార్నవమి, విజయదశమి వేడుకలతో కోల్‌కతాలో పండగ కళ కనిపిస్తుంది. ఇటీవలే వివాహమైన టీఎంసీ ఎంపీ నుష్రత్ జహాన్ కూడా తన అత్తింట్లో సందడి చేశారు. సాటి మహిళలతో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు.

ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా నుష్రత్ అత్తవారింట్లో పండగకళ కనిపించింది. ఎర్రని చీర కట్టుకొని, తన బంధువులతో కలిసి స్టెప్పులేశారు. దీనికితోడు ఆమె భర్త డోల్ వాయించగా హుషారుగా కాలు కదిపారు.'ధాక్' అనే బెంగాలీ డోల్‌ను నుష్రత్ భర్త నిఖిల్ జైన్ వాయించారు. ఆమె డ్యాన్సుతో మిగతా మహిళలు కూడా కాలు కదిపారు. దీంతో ఆ ప్రాంగణంలో పండగకళ కనిపించింది. ఆ తర్వాత నుష్రత్ కూడా 'ధాక్' అనే డోలు మోగించారు.

nikhil plays ‘dhaak’ nurshat jahan dance in durga ashtami

తర్వాత తన భర్త నిఖిల్ జైన్‌తో కలిసి హారతి పూజలో నుష్రత్ పాల్గొన్నారు. తమ ఇంట్లో జరిగిన దుర్గాష్టమికి సంబంధించిన ఫోటోలను నుష్రత్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బషిర్షత్ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీచేసి నుష్రత్ జహన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి సత్యంతన్ బసుపై మూడున్నర లక్షల ఓట్లతో విజయం సాధించారు. ఏప్రిల్-మే లో ఎన్నికలు ముగియగా, జూన్‌లో నిఖిల్‌ జైన్‌ను నుష్రత్ వివాహమాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+