అమ్మాయిలను తెచ్చారు: చిత్తుగా తాగేసి పోలీసులపై కాల్పులు జరిపారు
బెంగళూరు: మద్యం మత్తులో అమ్మాయితో జల్సా చేస్తున్నసమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు పోలీసులు తప్పించుకున్నారు. తమపై కాల్పులు జరిపిన 9 మందిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగరలో పిల్ ప్యూ అపార్ట్ మెంట్ లో శుక్రవారం రాత్రి వీకెండ్ పార్టీ ఎర్పాటు చేశారు. అపార్ట్ మెంట్ మూడవ అంతస్తులోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అప్పటికే పీకలదాక మద్యం సేవించి పూర్తి మత్తులో ఉన్నారు.
వారి స్నేహితులు కోందరు అర్దరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో కారులో అమ్మాయిలను ( విద్యార్థుల స్నేహితులు) పిలుచుకుని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లారు. తరువాత మూడవ అంతస్తులోని ఫ్లాట్ లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో అక్కడ ఉన్న సెక్యూరిటిగార్డులు విద్యార్థులను ప్రశ్నించారు.

ఈ అపార్ట్ మెంట్ లో చాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని. ఇంత రాత్రి మీరు అమ్మాయిలను పిలుచుకుని లోపలికి వెళ్లరాదని సెక్యూరిగార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఫ్లాట్ లోకి తాము అమ్మాయిలను తీసుకుని వస్తే మీకు ఏమిటి అభ్యంతరమని విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. పెద్ద రాద్దాంతం అయ్యింది.
విషయం తెలుసుకున్న రాజరాజేశ్వరినగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో విద్యార్థులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అదే సమయంలో మూడవ అంతస్తులో ఉన్న విద్యార్థులు అదే అంతస్తులోని బాల్కని దగ్గరకు వచ్చారు.
తరువాత అక్కడి నుండి పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు చాకచక్యంగా తప్పించుకున్నారు. కొంత సేపటి తరువాత మూడవ అంతస్తులోని ఫ్లాట్ లోకి వెళ్లారు. ఫ్లాట్ లో వీకెండ్ పార్టీ చేసుకుంటున్న ఆయుష్, రజత్, కృష్ణతో సహ 9 మందిని అరెస్టు చేశారు. కాల్పులు జరిపింది ఎవరో ఇంకా తెలియడం లేదని దర్యాప్తు చేస్తున్నామని రాజరాజేశ్వరినగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications