ఏకమవుతున్న ప్రతిపక్షాలు - ప్రధాని మోదీకి ఘాటు లేఖ : కేసీఆర్ - మమతా సహా..!!

ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష నేతలు ఏకం అవుతున్నారు. ప్రధానికి రాసిన లేఖలో కేంద్ర తీరుపై మండిపడ్డారు.

ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష నేతలు ఏకం అవుతున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వంగా మారుస్తున్నారని మండి పడుతున్నారు. విచారణ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఈ మేరకు తొమ్మది విపక్ష పార్టీలు ప్రధాని మోదీకి లేఖ రాసాయి. అందులో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు. దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ మేరకు ఉమ్మడి లేఖను విడుదల చేసారు. వేధింపుల్లో భాగామే అరెస్ట్ అని పేర్కొన్నాయి.

ప్రధానికి రాసిన ముఖ్య నేతల లేఖ

ప్రధానికి రాసిన ముఖ్య నేతల లేఖ

ప్రధాని మోదీకి రాసిన లేఖలో విపక్ష నేతలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమని పేర్కొన్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల ను లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ సుప్రీం లీడర్ శరద్ పవార్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంతకాలు చేశారు. ఇందులో ప్రధానంగా ఒక పార్టీకో, వ్యక్తికో భిన్నంగా ఉన్న భావజాలాన్ని సైతం గౌరవించాలని ప్రధాని సూచించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని కోరారు.

టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ

టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ

సిసోడియాకు సంబంధించి ఒక్క ఆధారం కూడా వ్యతిరేకంగా లేదని..అయినా టార్గెట్ చేసి ఆయన్ను ఆరెస్ట్ చేసారని నేతలు తమ లేఖలో పేర్కొన్నారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విపక్షాలను లక్ష్యం చేసుకొనే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజకీయ వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనేందుకు ఆయన అరెస్టు ఓ ఉదాహరణగా పేర్కొన్నారు.

సిసోదియాకు ఢిల్లీ పాఠశాల విద్యలో తీసుకొచ్చిన మార్పు లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. 2014-15లో హిమంత బిశ్వ శర్మ (ప్రస్తుతం అసోం సీఎం)పై శారదా చిట్​ఫండ్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేశాయన్నారు.

బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసు పురోగతే లేదని పేర్కొన్నారు. నారదా స్కామ్​లో పేర్లు వినిపించిన బంగాల్​లో సువేందు అధికారి, ముకుల్ రాయ్, మహారాష్ట్రలో నారాయణ్ రాణె వంటి వారి విషయంలోనూ జరిగిందంటూ విపక్ష నేతలు లేఖలో వివరించారు.

గవర్నర్ల తీరు పైనా అభ్యంతరం

దర్యాప్తు సంస్థలను మీ ప్రభుత్వం విపక్షాలను వేధించేందుకే ఉపయోగించుకుంటోందనిపేర్కొన్నారు. విపక్షాల లేఖఅదానీ- హిండెన్​బర్గ్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. ప్రాధాన్యాలను ప్రభుత్వం విస్మరిస్తోందని పేర్కొన్నాయి. దీంతోపాటు దేశ సమాఖ్య వ్యవస్థపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని వ్యాఖ్యానించాయి.

దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో పదేపదే గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారని వివరించారు. దిల్లీ, తమిళనాడు, బంగాల్, పంజాబ్, తెలంగాణ వంటి బీజేపేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావాలనే పాలనను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగేందుకు గవర్నర్లు కారణమవుతున్నారని విపక్ష నేతలు తమ లేఖలో ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+