వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చింది రెస్పాన్స్... ఉద్యోగం కావాలంటూ నాసాకు ‘ఏలియన్’ దరఖాస్తు!

తాను గ్రహాంతరవాసిననీ... తనకు నాసాలో ఉద్యోగం ఇవ్వాలని తొమ్యిదేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడు రాసిన లేఖను నెటిజన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను గ్రహాంతరవాసిననీ... తనకు నాసాలో ఉద్యోగం ఇవ్వాలని తొమ్యిదేళ్ల బాలుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు అతడు రాసిన లేఖను నెటిజన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది క్షణాల్లోనే అది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవడంతో చదివిన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

భూమిని కాపాడ‌తారా? నాసాలో ఉద్యోగం.. ఏడాదికి కోటి జీతం!భూమిని కాపాడ‌తారా? నాసాలో ఉద్యోగం.. ఏడాదికి కోటి జీతం!

ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాల కోసం ఇటీవల నాసా నోటిపికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏలియన్ మైక్రో ఆర్గానిజం నుంచి భూమిని పరిరక్షించడమే ఈ అధికారుల పని. అయితే ఈ ఉత్తరం రాసిన పిల్లాడు సదరు పోస్టుకు తాను సరిగ్గా సరిపోతానని చెప్పుకొచ్చాడు. ఈ ఉద్యోగానికి అతడికున్న అర్హతలేంటో అతగాడి మాటల్లోనే చదవండి...!

Nine-year-old ‘Guardian of Galaxy’ applies for job at NASA to protect the planet

''డియర్ నాసా, నాపేరు జాక్ డేవిస్. ప్లానిటరీ ప్రొటెక్షన్ అధికారి పోస్టు కోసం నేను దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. నాకు తొమ్మిదేళ్లే అయినా ఆ ఉద్యోగం చేసేందుకు సరైన వాడినని భావిస్తున్నాను. ఒక కారణమేంటంటే.. మా అక్క నన్నెప్పుడూ ఏలియన్ అని పిలుస్తుంది. నేను కూడా ఇప్పటి వరకు అంతరిక్షంపై, ఏలియన్స్‌పై వచ్చిన అన్ని సినిమాలూ చూశాను. వీడియో గేమ్స్ కూడా బాగా ఆడతాను. నేను చిన్నవాడిని కాబట్టి ఏలియన్స్ లాగా ఆలోచించగలను...'' ఇలా సాగిపోయింది అతడి దరఖాస్తు లేఖ.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఇది వైరల్ గా మారింది. అందరూ ఈ లేఖను చూసి నవ్వుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. దరఖాస్తు లేఖ చివర్లో జాక్ డేవిస్ తన పేరు కింద 'గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ.. 4వ గ్రేడ్' అని రాయడం.

English summary
A nine-year-old believes he is up to the task of being ‘Guardian of the Galaxy’, and his application to NASA’s job posting has caught just as much attention as the job profile itself: protect Earth from alien contamination and vice-versa. NASA, the US space agency, generated much chatter on the internet as the job description did the rounds. The agency is looking for a Planetary Protection Officer who can keep contamination from space on Earth, or the other way around, to an absolute minimum. Young Jack Davis was among the many who sent in their resumes. His was a handwritten letter that further showed his eagerness. Though too young to apply for a job, Davis thinks he is qualified for the position.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X