వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్బీ స్కాం: ఖరీదైన వజ్రాలు, ఆభరణాలు లంచంగా ఇచ్చిన నీరవ్ మోదీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు‌ను ముంచిన వ్యాపారి నీరవ్ మోడీ పెద్ద ఎత్తున బ్యాంకు అధికారులకు లంచాలు ఇచ్చారని సిబిఐ గుర్తించింది. ఈ విషయాన్ని సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు‌ను ముంచేశారు నీరవ్ మోడీ. సుమారు 12 వేల కోట్లను నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచాడని సిబిఐ అధికారులు గుర్తు చేశారు. నీరవ్ మోడీ తరహలోనే మరో ఇద్దరు కూడ బ్యాంకులను మోసం చేసినట్టు బయటకు వచ్చింది.

బ్యాంకులను బడా వ్యాపారులు వేల కోట్లలో ముంచేశారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా ఈ మోసాలు జరగవని అధికారులు అబిప్రాయపడుతున్నారు.అయితే ఈ కేసుకు సంబంధించిన విషయమై సిబిఐ అధికారులు పక్కా అదారాలను సేకరించే పనిలో పడ్డారు.

బ్యాంకు అధికారులకు లంచాలిచ్చిన నీరవ్ మోదీ

బ్యాంకు అధికారులకు లంచాలిచ్చిన నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ. 12 వేల కోట్లకు పైగా ముంచేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, బ్యాంకు అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించిన సీబీఐ తరఫు న్యాయవాది బ్యాంకులోని ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి బంగారు నాణాల నుంచి వజ్రాభరణాల వరకూ నీరవ్ కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు.

లంచాలతో నీరవ్ మోదీకి సహకారం

లంచాలతో నీరవ్ మోదీకి సహకారం

నీరవ్ మోదీ నుండి ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను బ్యాంకు అదికారులు లంచంగా తీసుకొన్నారని సిబిఐ గుర్తించింది . ఈ లంచం తీసుకొన్న తర్వాత మోదీకి సహకరించారని సిబిఐ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీ కోరుకొన్నట్టుగానే ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లు ఇచ్చారని సిబిఐ గుర్తించింది. ఇదే విషయాన్ని కోర్టుకు సిబిఐ వివరించింది.

బంగారు ఆభరణాలు తీసుకొన్నట్టు ఒప్పుకొన్న అధికారి

బంగారు ఆభరణాలు తీసుకొన్నట్టు ఒప్పుకొన్న అధికారి

60 గ్రాముల బరువున్న రెండు బంగారు నాణాలు, ఓ జత బంగారు, మరో జత వజ్రాల చెవి రింగులను నీరవ్ ఇచ్చినట్టు యశ్వంతో జోషి అనే అధికారి సిబిఐ అధికారుల విచారణలో వెల్లడించారు. జోషి ఇంటి నుండి ఈ ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు.

నీరవ్ మోదీ కేసులో 14 మంది అరెస్ట్

నీరవ్ మోదీ కేసులో 14 మంది అరెస్ట్

ఈ కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్ట్ చేశామని, వీరందరికీ నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీల నుంచి ఏదో ఒక రూపంలో లంచాలు అందాయని సిబిఐ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో పక్కా ఆధారాలను సేకరిస్తున్నామని సిబిఐ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కోర్టుకు వివరించారు.

English summary
An official of Punjab National Bank received gold and diamond jewellery from a billionaire jeweller accused of being involved in a Rs. 12,600 crore bank fraud, the Central Bureau of Investigation (CBI) told a court on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X