Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NIRF 2025 Rankings: టాప్ ఐఐటీలు, కాలేజీలు ఇవే- మన ఓయూ, ఏయూల పొజీషన్ ఇదే

జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2025 ర్యాంకింగ్‌లు విడుదలయ్యాయి. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా 10వ సారి టాప్ లో నిలిచింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ వంటి 17 విభాగాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల పనితీరు, అవి సాధించిన ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ను కేటాయించారు.

మొదటి 100 స్థానాల్లో ఉన్న ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే 101-150, 151-200 ర్యాంక్ బ్యాండ్‌లు ఇందులో పొందుపరిచారు. బోధన, బోధనేతర, స్టడీ, వనరులు, పరిశోధన, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఔట్రీచ్, ఇన్ క్లూజివిటీ, పర్ సెప్షన్ అనే అయిదు ప్రధాన పారామీటర్ల మీద ఆధారపడి ఈ ర్యాంకింగులు రూపొందాయి. ఈ సంవత్సరం కొత్తగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ (SDG) కేటగిరీని ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. NIRF 2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు.

NIRF 2025 Rankings Show IIT Madras at the Top- Find Out More

ఇందులో ఓవరాల్, యూనివర్సిటీ, కాలేజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, న్యాయశాస్త్రం, మెడిసిన్, ఆర్కిటెక్చర్, డెంటల్, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సంబంధిత రంగాలు, పరిశోధనా సంస్థలు, ఓపెన్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 10,885 దరఖాస్తులు అందాయి. వాటన్నింటినీ వడపోసిన అనంతరం ర్యాంకింగులను కేటాయించింది.

ఐఐటీ కేటగిరీలో..

ఈ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 2. ఐఐఎస్సీ- బెంగళూరు, 3. ఐఐటీ- బాంబే, 4. ఐఐటీ- ఢిల్లీ, 5. ఐఐటీ- కాన్పూర్, 6. ఐఐటీ- ఖరగ్‌పూర్, 7. ఐఐటీ- రూర్కీ, 8. ఎయిమ్స్- ఢిల్లీ, 9. జేఎన్‌యూ- ఢిల్లీ, 10. బనారస్ హిందూ యూనివర్సిటీ- వారణాసి ఉన్నాయి.

ఐఐఎం కేటగిరీలో..

టాప్ 10 మేనేజ్‌మెంట్ సంస్థల జాబితా ఐఐఎం అహ్మదాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2. ఐఐఎం- బెంగళూరు, 3. ఐఐఎం- కోజికోడ్, 4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- ఢిల్లీ, 5. ఐఐఎం- లక్నో, 6. ఐఐఎం- ముంబై, 7. ఐఐఎం కోల్‌కత, 8. ఐఐఎం- ఇండోర్, 9. మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్- గుర్గావ్, 10. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్- జంషెడ్‌పూర్‌ ఉన్నాయి.

ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్..

ఐఐటీ- రూర్కీ ఈ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కాలికట్, 3. ఐఐటీ- ఖరగ్‌పూర్, 4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- శిబ్‌పూర్, 5. జామియా మిలియా ఇస్లామియా- న్యూఢిల్లీ ఉన్నాయి.

న్యాయశాస్త్రంలో..

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ.. దేశంలోనే అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయంగా నిలిచింది. 2. నేషనల్ లా యూనివర్సిటీ- ఢిల్లీ, 3. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా- హైదరాబాద్, 4. ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్- కోల్‌కత, 5. గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ- గాంధీనగర్ నిలిచాయి.

కాలేజీల కేటగిరీలో..

ఈ కేటగిరీలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కళాశాలలు ఆధిపత్యం చెలాయించాయి. మొదటి అయిదు స్థానాల్లో అవే ఉన్నాయి. హిందూ కాలేజ్ మొదటి స్థానంలో నిలవగా, మిరాండా హౌస్ రెండవ స్థానాన్ని, హన్స్ రాజ్ కాలేజ్ మూడవ స్థానాన్ని పొందాయి. కిరోరి మాల్ కాలేజ్ నాలుగు, సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ అయిదవ స్థానంలో నిలిచాయి. ఇవన్నీ ఢిల్లీ నుంచే కావడం విశేషం.

6. రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజీ- కోల్ కత, 7. ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీ-ఢిల్లీ, 8. సెయింట్ జేవియర్స్ కాలేజీ- కోల్ కత, 9. పీఎస్జీఆర్ కృష్ణమ్మాళ్ కాలేజీ ఫర్ విమెన్- కోయంబత్తూర్, 10. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్- కోయంబత్తూర్.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్శిటీలు..

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విభాగంలో జాదవ్‌పూర్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతాలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2. అన్నా యూనివర్సిటీ- తమిళనాడు (చెన్నై), 3. పంజాబ్ యూనివర్సిటీ- చండీగఢ్, 4. ఆంధ్ర యూనివర్సిటీ- ఏపీ (విశాఖపట్నం), 5. కేరళ యూనివర్సిటీ- తిరువనంతపురం, 6. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- కొచ్చిన్, 7. ఉస్మానియా యూనివర్సిటీ- తెలంగాణ (హైదరాబాద్), 8. కశ్మీర్ యూనివర్సిటీ- శ్రీనగర్, 9. గౌహతి యూనివర్సిటీ, భారతియార్ యూనివర్సిటీ- కోయంబత్తూర్ టాప్ 10లో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+