యువతా ఇది విన్నారా?: నిర్మలా సీతారామన్ ‘మిలీనియల్స్ ’ కామెంట్స్‌పై పేలుతున్న సెటైర్లు!
చెన్నై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో మొబైల్ రంగం మందగమనంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆధునిక యువతి కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అంతేగాక, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్ని నవ్వు పుట్టించేవిగా ఉన్నాయి.
అందుకే నిరుద్యోగం పెరిగిపోయిందా?
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అంతేగాక, డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోందని వ్యాఖ్యానించాడు. నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.. ఎందుకంటే నేరాలను భరించకుండా వాటిని అడ్డుకోవడం వల్లేనని చెప్పుకొచ్చాడు.
బైది లాజిక్..
టీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఎందుకంటే ప్రజలు కాఫీనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి.
టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఎందుకంటే.. ప్రజలు రోమ్ న్యాకుడ్ ను ఇష్టపడుతున్నారు కాబట్టి..
తయారీరంగం కూడా ఇలాగే సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని వ్యాఖ్యానించాడు మరో నెటిజన్.
వాట్సాప్ మెసేజ్ చూసేనా..
వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ చూసే ఆర్థిక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? నేను కూడా ఇలాంటి న్యూస్ చూశాను అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇలా..
2017, 2018 సంవత్సరాలతో పోల్చుకుంటే 2019 సంవత్సరంలో ఓలా, ఉబెర్‌లో అంతగా వృద్ధిని నమోదు చేయలేదని, ఇది చూసి ఆర్థిక మంత్రి మాట్లాడితే బాగుంటుందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చురకలంటించింది.
యువత ఇది విన్నారా?
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని యువత విన్నదా? వింటే మరి ఆ పనేది చేయండి. ఆటో రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించండి అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
నిర్మలకు మద్దతుగా కూడా
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో అనుభవం గల రాజకీయ నేత అని, ఆమెకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ సేవలను వాడటం వల్లే ఆటో రంగం కొంత దెబ్బతిందనేది వాస్తవమని అన్నారు.
మోడీ జాకెట్లు అందుకే..
మోడీ జాకెట్ల గిరాకీ బాగా తగ్గిందని.. ఎందుకంటే యువత బట్టలు పంచుకోవడమే ఇందుకు కారణం అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications