హౌసింగ్ రంగానికి కేంద్రం బూస్ట్ : రూ.10 వేల కోట్లు ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలా

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యంతో వృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. దేశ స్థూల జాతీయోత్పత్పి 5 శాతానికి చేరిపోవడంతో కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. వారం వారం ప్రగతిని సమీక్షిస్తూ .. కార్యాచరణ రూపొందిస్తోంది. అన్నీ రంగాలపై సమీక్షిస్తూ .. అందరినీ ఆదుకుంటామని భరోసానిస్తోంది.

కొత్తగా గృహ రుణం తీసుకునే వేతన జీవులకు నిర్మలా సీతారామన్ ఊరట కల్పించారు. హౌసింగ్ విభాగానికి రూ.10 వేల కోట్ల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని పేర్కొన్నారు. దీంతో కొత్తగా గృహాలు కొనుగోలు చేసే వారికి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. హౌజింగ్ ప్రాజెక్టుకు ఊతమిచ్చేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్లతో కొత్తగా గృహ నిర్మాణంలో పెట్టుబడి పెట్టే వారికి మేలు కలుగుతుందని నిర్మలా పేర్కొన్నారు. రియల్టర్లు మరింత ముందుకొచ్చి తమ ప్రాజెక్టులను కొనసాగిస్తారని పేర్కొన్నారు.

Nirmala Sitharaman announces Rs 10,000 cr special window to boost housing

దీంతోపాటు ఇప్పటికే నిలిచిపోయిన కొన్ని భవన నిర్మాణ సముదాయాలు కూడా పూర్తవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో మధ్యతరగతి వారు .. గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతోపాటు భవన నిర్మాణాల్లో తీసుకునే వడ్డీని కూడా తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇదీ ప్రభుత్వ ఉద్యోగులకు కలిసి వస్తోందని చెప్పారు. దేశంలో గృహాలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో .. ఈ మేరకు హౌసింగ్ సెక్టార్‌పై ఫోకస్ చేశారు. దీంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన వారికి ఇళ్లు కట్టిస్తామని కూడా హామీనిచ్చారు.

Recommended Video

    వైసీపీ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది!! | Nirmala Sitharaman Grants ‘NO’ To AP Special Status!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+