Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2024: ఇల్లు, స్థలం అమ్ముతున్నారా.. అయితే మీ జేబుకు చిల్లే..!

కేంద్ర బడ్జెట్ లో కొన్ని షాకింగ్ ప్రకటనలు వచ్చాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి అమ్మకందారులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇళ్లు, స్థలాలు అమ్మితే ఇప్పటి నుంచి పన్ను కట్టాల్సింది. ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్లూ ఉన్న ఇండెక్సేషన్ బెన్ ఫిట్స్ ను నిర్మల సీతారామన్ రద్దు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఆస్తి విక్రయం ద్వారా ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) పన్నులో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.

15 సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో 12.5 శాతం పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం పేర్కొంది. నిర్మల సీతారామన్ రాక ముందు లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ బెన్ ఫిట్స్ తో కూడిన 10 శాతం పన్ను ఉండేది. ఆస్తి యజమానులు తమ కొనుగోలు ధరను ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ బెన్ ఫిట్స్ ఉండేది. ఇక నుంచి ఆస్తి అమ్మకంపై మూలధన లాభాలకు 12.5% ​​కొత్త LTCG పన్ను రేటు వర్తింప జేయనున్నారు.

Nirmala Sitharaman said that capital gain tax should be paid on the sale of house and land

ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్ ల్లో ఒత్తిడి నెలకొంది. డీఎల్ ఎఫ్ స్టాక్ 6 శాతం, గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ 5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3 శాతం, ఫీనిక్స్ మిల్స్ షేర్ 2.1 శాతం పడిపోయాయి. ఉదాహరణకు అయ్యప్ప అనే వ్యక్తి 2002-2003 ఆర్థిక సంవత్సరంలో రూ. 25 లక్షలకు ఆస్తిని కొనుగోలు చేసి, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటికి విక్రయించార అనుకుంటే అతనికి రూ.75 లక్షలు లాభం వచ్చినట్లు.

గతంలో అయితే మునుపటి నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ అందించిన ధర ద్రవ్యోల్బణ సూచిక (CII) సంఖ్యలను ఉపయోగించి రూ. 25 లక్షల కొనుగోలు ధర సర్దుబాటు చేసే అవకాశం ఉండేది. కొత్త నియమం అమల్లోకి రావడంతో, ఎలాంటి ద్రవ్యోల్బణం సర్దుబాటు లేకుండా, అమ్మకపు ధర నుంచి కొనుగోలు ధరను నేరుగా తీసివేయడం ద్వారా మూలధన లాభాలను లెక్కించనున్నారు. ఈ మార్పును ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ స్వాగతించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+