Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజకీయాల్లోకి నితీష్ కుమారుడు? సంకేతమిచ్చిన వారసుడు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఎన్డీయే 202 సీట్లతో చారిత్రక విజయాన్ని సాధించిన నేపథ్యంలో నిశాంత్ కుమార్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిశాంత్ కుమార్ సాధారణంగా మీడియాకు, రాజకీయ వేదికలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎన్నికల అనంతరం ఆయన బహిరంగంగా మాట్లాడటం రాజకీయ సంకేతాలకు దారితీసింది.

ఎన్డీఏ విజయంపై నిశాంత్ కుమార్ ఏమన్నారంటే?
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 202 సీట్ల భారీ మెజారిటీ లభించగా.. మహాకూటమి 35 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంపై నిశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘన విజయం తన నితీష్ కుమార్ గత 20 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనులకు లభించిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. "నేను బీహార్ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మాకు నమ్మకం ఉంది, కానీ ఫలితాలు ఆశించిన దానికంటే చాలా మెరుగ్గా వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా ప్రజలకే చెందుతుంది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది, ప్రజలకు చాలా కృతజ్ఞతలు," అని నిశాంత్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రజల విశ్వాసాన్ని ముందు కూడా నిలబెట్టుకుంటారని, అభివృద్ధి విధానాలను కొనసాగిస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Nishant Kumar Sparks Buzz After NDA Big Bihar Win Is Nitish Kumar Son Entering Politics

నితీష్‌పై ప్రశంసలు
నిశాంత్ తన తండ్రి నితీష్ కుమార్ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడారు. "నాన్నగారికి 20 ఏళ్ల శ్రమకు బహుమతి లభించింది. ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజలు అంగీకరించారు. ఈ విజయం ఒక్క నాయకుడిది కాదు, బీహార్‌లోని ప్రతి పౌరుడి విజయం. నాన్నగారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారు. ప్రజలు ఇంతటి భారీ తీర్పును ఇచ్చిన నమ్మకం భవిష్యత్తులో కూడా నిలబడుతుంది. ఇప్పుడు అభివృద్ధి వేగం మరింత పెరుగుతుంది. యువత, మహిళలు, గ్రామీణ ప్రాంతాలకు కొత్త పథకాల ప్రయోజనం నేరుగా అందుతుంది." అని నిషాంత్ పేర్కొన్నారు.

రాజకీయ చర్చకు కారణం
ప్రత్యేకించి ఎన్నికల ప్రచారం అంతటా నిశాంత్ ఏ ర్యాలీలోనూ, వేదికపైనా కనిపించలేదు. ఎప్పటిలాగే మీడియాకు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఎన్డీయే విజయం తర్వాత ఆయన చేసిన ఈ ప్రకటన రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనికి ముందు జనవరి 2025లో తన తండ్రితో కలిసి బఖ్తియార్‌పూర్ వెళ్లినప్పుడు నిశాంత్ మొదటిసారిగా బహిరంగంగా రాజకీయ విజ్ఞప్తి చేశారు. "మీరంతా వీలైతే నాన్నగారికి, ఆయన పార్టీకి ఓటు వేసి మళ్లీ గెలిపించండి." అని ఆయన అప్పుడు అన్నారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు నిశాంత్ నితీష్‌కు మద్దతుగా పలు సందర్భాల్లో మాట్లాడారు. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు మళ్లీ మీడియాకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రకటన చేయడంతో ఆయనపై దృష్టి కేంద్రీకృతమైంది.

నిశాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
జేడీయూ పార్టీలో, దాని మద్దతుదారుల మధ్య నిశాంత్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఆయన మళ్లీ తెరపైకి రావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన చాలాసార్లు చెప్పారు. నితీష్ కుమార్ అన్నయ్య సతీష్ కుమార్ కూడా నిశాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు, అయితే అది పూర్తిగా నిశాంత్ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. నిశాంత్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆయన వయస్సు 49 సంవత్సరాలు. సాంప్రదాయ రాజకీయ కుటుంబాలలో మాదిరిగా కాకుండా, వారసులు మొదటి రోజు నుంచే రాజకీయాల్లోకి వచ్చే పద్ధతికి ఆయన భిన్నంగా ఉన్నారు. ఆయన బహిరంగ జీవితానికి, వివాదాలకు దూరంగా ఉంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను కొనసాగిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+