నితిన్ వ్యాఖ్యల కలకలం: బీజేపీలో మీకు దమ్ముందని రాహుల్.. దిమ్మతిరిగే షాకిచ్చిన గడ్కరీ

భోపాల్: కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలు తొలుత ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన అనంతరం పార్టీ గురించి ఆలోచించాలని చెప్పారు. ఇంటిని చక్కబెట్టుకోలేనివారు పార్టీలో రాణించడం కష్టమని చెప్పారు. నాగపూర్‌లో ఏబీవీపీ మాజీ నేతల కార్యక్రమంలో మాట్లాడారు.

తాము పార్టీ, దేశానికి అంకితం అవుతామని చాలామంది తనను అడుగుతున్నారని నితిన్ గడ్కరీ చెప్పారు. అలాంటి వారిలో ఒకాయన ఇంటి దగ్గర ఉన్న దుకాణం సరిగా నడపలేకపోయారని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారని, ఇక నుంచి పార్టీలో పని చేద్దామనుకుంటున్నానని తన వద్దకు వచ్చారని, దానికి తాను ముందు ఇంటి బాధ్యతలు సరిగా నిర్వర్తించండని, ఇంటిని సరిగా చక్కబెట్టుకోలేనివారు దేశ అవసరాలను తీర్చడం కష్టమని చెప్పి తిప్పి పంపించానని సూచించానని అన్నారు.

Nitin Gadkari only one in BJP with guts, tweets Rahul Gandhi, then adds a request

ఎవరైనా ఇంటి బాధ్యతలు నిర్వర్తించి, పిల్లలు బాగోగులు చూసుకోవాలని, ఆ తర్వాతే పార్టీ కోసం, దేశం కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు.

బీజేపీలో దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ నాయకుడు గడ్కరీ మాత్రమే అని కితాబిచ్చారు. రాఫెల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతుల ఆవేదన, వ్యవస్థల నిర్వీర్యం గురించి కూడా మాట్లాడాలని నితిన్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. 'మరో ముఖ్యమైన విషయం మరిచిపోయాను, గడ్కరీ జీ.. జాబ్స్!, జాబ్స్!' దీనిపైనా మాట్లాడాలన్నారు.

దీనిపై నితిన్ గడ్కరీ కూడా రాహుల్ గాంధీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. రాహుల్ గారూ... నా ధైర్యం విషయంలో మీ నుంచి సర్టిఫికెట్‌ అవసరం లేదని, ఓ విషయం మీద మాత్రం ఆశ్చర్యపోయానని, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మీరు ప్రభుత్వంపై దాడి చేయడానికి మీడియా ప్రచురించిన తప్పుడు సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నారని, ఇలా ఇతరులపై ఆధారపడి విమర్శలు చేస్తుంటే ప్రధాని మోడీతో పాటు తమ ప్రభుత్వానికి ఉన్న బలం ఎంతో తెలుస్తోందని గట్టి షాకిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+