Petrol: రూ.15 లకే లీటర్ పెట్రోల్.. ప్రకటించిన కేంద్ర మంత్రి..!

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అయితే పెట్రోల ధరకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. లీటర్ పెట్రోల్ ను రూ.15 లకే అందించవచ్చని చెప్పారు. కానీ..సగటున 60% ఇథనాల్, 40% విద్యుత్ తీసుకుంటే లీటరుకు రూ.15 చొప్పున పెట్రోల్ లభిస్తుందని తెలిపారు.

ఇలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రూ.5600 కోట్ల విలువైన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. 219 కి.మీ దూరం రూ. 3,775 కోట్ల వ్యయంతో నాలుగు జాతీయ రహదారుల ప్రారంభంచారు. "సగటున 60% ఇథనాల్, 40% విద్యుత్ తీసుకుంటే, పెట్రోల్ లీటరుకు రూ.15 చొప్పున అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. కాలుష్యం, దిగుమతులు తగ్గుతాయి. దిగుమతులు సొమ్ము రూ. 16 లక్షల కోట్లు రైతుల ఇళ్లకు వెళ్తుంది" అని గడ్కరీ అన్నారు.

Nitin Gadkari

రైతులను "అన్నదాత" (ఆహార ప్రదాతలు). "ఉర్జాదాత" (ఇంధన ప్రదాతలు)గా మార్చడమే ప్రభుత్వ దార్శనికమని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. "ఫతేనగర్ వద్ద జాతీయ రహదారి 162Aపై నాలుగు లేన్ల రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కారమవుతుంది" అని మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్‌లో, సెంట్రల్ రోడ్స్ ఫండ్ కింద రూ.2250 కోట్లతో కొత్తగా 74 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.

Nitin Gadkari

ప్రతాప్‌గఢ్‌ బైపాస్‌ నిర్మాణం వల్ల నగరంలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది. రాస్‌ నుంచి బియోరా వరకు రోడ్డు నిర్మాణంతో భిల్వారా వైపు వెళ్లే వాహనాలు సులభతరం అవుతాయన్నారు. దుంగార్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, బన్స్వారా ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. సంగ్వారా, గర్హిలో బైపాస్ నిర్మాణంతో, దుంగార్‌పూర్-బన్స్వారా మధ్య దూరం 10 కి.మీ తగ్గుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+