లాలూ రో: నితీష్‌పై సొంతనేత సంచలనం, రాహుల్ తోక..

లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు నిజమేననేలా జెడి(యు)కు చెందిన పార్టీ నేత శివానంద్ తివారీ వ్యాఖ్యలు చేశారు. అర్జేడి చీలిక వెనుక నితీష్ కుమార్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ఎమ్మెల్యేలను మభ్యపెట్టడం వల్లనే వారు రెబల్స్‌గా మారారని అభిప్రాయపడ్డారు.
రాహుల్, మోడీలపై శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మీసంలాంటి వారైతే, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తోకలాంటి వారన్నారు.
నీముచ్‌లో ఓ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ ఆయన శివరాజ్ సింగ్ పైవ్యాఖ్యలు చేశారు. మోడికి, రాహుల్‌కు పోలిక లేదని అభిప్రాయపడ్డారు. కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవడానికే భయపడిన వ్యక్తి ప్రధానమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications