చాణక్యంలో చంద్రబాబు అంతటివాడు: కొత్త సీఎంగా ప్రమాణం తేదీ ఇదే..!!
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. మరో విడత బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది వరుసగా అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ నెల 15 లేదా 18వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ప్రభంజనం సృష్టించింది ఎప్పట్లాగే. మొత్తం 75 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జేడీయూకు క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే వార్తలు వెలువడినప్పటికీ.. ఈ ఫలితాలను బట్టి చూస్తోంటే..అవన్నీ కూడా పటాపంచలయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ మెజారిటీని సాధిస్తోన్నారు జేడీయూ అభ్యర్థులు.

అదే సమయంలో రాజధాని పాట్నా సహా రాష్ట్రవ్యాప్తంగా 'టైగర్ అభీ జిందా హై' అనే నినాదంతో కూడిన నితీష్ కుమార్ పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. 74 సంవత్సరాల నితీష్ కుమార్ పాలనపై పట్టు కోల్పోయారని రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ కూటమి విమర్శలను ఈ విజయంతో తిప్పికొట్టారు నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. తన అనుభవం ముందు ఎవరూ నిలువలేరనే విషయాన్ని రుజువు చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 101 స్థానాల్లో పోటీ చేసింది జేడీయూ. 75 నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యతలో కొనసాగుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2020 నాటి ఎన్నికలతో పోలిస్తే జేడీయూ దాదాపు 30 సీట్లను ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫలితాలపై అటు జనతాదళ్ (యునైటెడ్) స్పందించింది. ఇంకొన్ని గంటల్లో రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన రాబోతోందని ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది.
అలీనగర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని మైథిలీకుమార్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బిప్లవ్ చౌదరి వెనుకంజలో ఉన్నారు. ప్రారంభ ఫలితాల్లో వెనుకపడ్డ తేజ్ ప్రతాప్ యాదవ్. సంజయ్ కుమార్ సింగ్ ఇక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. మొకామాలో బాహుబలి అనంత్ సింగ్, తారాపూర్ లో సామ్రాట్ చౌదరి, దానాపూర్ లో కేంద్ర మాజీ మంత్రి కృపాల్ యాదవ్, బేతియాలో మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యత సాధించారు.












Click it and Unblock the Notifications