విభేదాలు మాంఝీ అవుట్: బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ కుమార్?

న్యూఢిల్లీ: బీహార్‌లో రాజకీయ సమీకరణులా శరవేగంగా మారుతున్నాయి. జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు చోటు చేసుకోవడంతో నాయకత్వ మార్పు జరగవచ్చని తెలుస్తోంది. దీనికి గాను జనతాదళ్ (యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ బుధవారం ఉదయం పాట్నాకి చేరుకున్నారు. అతనితో పాటు జేడీయు సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కెసీ త్యాగి కూడా ఉన్నారు.

దీంతో మాజీ సీఎం నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఛాన్సు ఉంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీయు పార్టీ పరాజయానికి గాను నైతిక బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Nitish Kumar set to take over as Bihar CM from Jitan Ram Manjhi

ఆ తర్వాత ఆయన స్ధానంలో సీఎంగా జితన్ రామ్ మాంఝీ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుల సమీకరణాల దృష్ట్యా జితేంద్రను సమర్ధిస్తూ వచ్చారు. ఐతే ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జితేంద్ర పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రచారం చేయలేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో బీజేపీలో భాగస్వామి అయిన జేడీయు ఆ తర్వాత విడిపోయి విడిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో బీహార్‌లో అటు జేడీయు, ఇటు ఆర్జేడీ రెండు పార్టీలు కలిసి పోరాడితేనే బీజేపీని ఎదుర్కొవడం సాధ్యపడుతుందని లాలూ జేడీయు కూటమికి మద్దతిస్తున్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత శరద్ యాదవ్‌తో గత వారంలో లాలూ చెప్పారని తెలుస్తోంది. దీంతో లాలూ ప్రసాద యాదవ్ నితీష్ కుమార్ నాయకత్వానికే ఓటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో నితిష్ కుమార్ మరోసారి సీఎం కుర్చీని కైవసం చేసుకుంటారని సమాచారం రావడంతో బుధవారం పాట్నాలోని ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+